ఈమధ్య కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్( Smart phone ) ను ఎక్కువగా యూస్ చేస్తున్నారు.ఇంకా చిన్నారులకు అయితే ఫోన్ లేకపోతే తిండి కూడా అసలు తినడమే లేదు.
ఏడిస్తే ఫోన్, తినాలంటే ఫోన్ ఇలా ప్రతి విషయాన్ని పిల్లలకు ఫోనే ప్రపంచం అయిపోయింది.ఆఖరికి బాత్రూం కి వెళ్ళాలి అన్న సెల్ఫోన్ లేకుండా ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు.
ఇలా రోజురోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోతోంది.దీనివలన మనిషి సెల్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు.
కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు మనుషులతో మాట్లాడడం మానేసి వెంటనే సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు.
కానీ ఫోన్ వినియోగం వలన ఆరోగ్యం పై చాలా ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచన మాత్రం ఎవరూ చేయడం లేదు.
సెల్ఫోన్ పై తాజాగా జరిగిన ఓ పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి.కౌమార దశలో ఉండేవారు ప్రతిరోజు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్ చూస్తే మానసికంగా ఒత్తిడి, డిప్రెషన్ ( Mental stress, depression ) లోకి వెళ్తారని దీంతో నిద్ర సమస్యలు, కంటి సమస్యలే కాకుండా పలు సమస్యలకు దారితీస్తాయని తేలింది.

కౌమార దశలో ఉండేవారు స్మార్ట్ఫోన్ వినియోగించడం వలన కొరియాలోని హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్( Hanyang University Medical Center, Korea ) బృందం పలు పరిశోధనలు చేశారు.ఈ దశలో ఉండేవారు రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్ ని యూస్ చేయడం వలన వారిలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల వినియోగం లాంటివి ఎక్కువగా ఉందని తేలింది.

ఫోన్ ని తక్కువగా వినియోగించే వారిలో మాత్రం ఇలాంటి ఆలోచనలు తక్కువగా ఉన్నాయని తేలింది.అయితే ఫోన్ అతిగా ఉపయోగిస్తే నిద్ర సరిగ్గా నిద్ర పట్టదు.దీంతో మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది.దీంతో నిద్రలేమి సమస్య వస్తుంది.దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.కాబట్టి రోజంతా ఫోన్ ఉపయోగిస్తే మెడ, వెన్నెముక సమస్యలు కూడా వస్తాయి.
కాబట్టి సెల్ఫోన్ వినియోగం తగ్గిస్తే మంచిది.