ఇండియా లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కైరా అద్వానీ( Kiara Advani ) కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఏం ఎస్ ధోని బయోపిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ, తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘భరత్ అనే నేను’( Bharat Ane Nenu ) సినిమా ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది.
ఆ తర్వాత తెలుగు లో రామ్ చరణ్ తో కేవలం ‘వినయ విధేయ రామ’ ( Vinaya Vidheya Rama ) సినిమా చేసింది.ఇది పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ సినిమా( Game Changer ) చేస్తుంది.శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
టాలీవుడ్ లో ఈమెకి సక్సెస్ రేషియో తక్కువ ఉన్నప్పటికీ , బాలీవుడ్ లో మాత్రం చాలా హిట్స్ ఉన్నాయి.

ఇకపోతే రీసెంట్ గానే ఈమె సిద్దార్థ్ మల్హోత్రా ని( Sidharth Malhotra ) ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ కపుల్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ ట్రెండింగ్ కపుల్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.రీసెంట్ వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది.
ఈ ఫోటో షూట్ కైరా అద్వానీ ధరించిన దుస్తులు, మరియు ఆమె వాడిన చెప్పుల మీద అభిమానుల కన్ను పడింది.ముఖ్యంగా ఆమె ధరించిన చెప్పుల విలువ ఆన్లైన్ లో చూస్తే దాదాపుగా లక్ష రూపాయిల వరకు ఉందట.
కైరా అద్వానీ కి వెరైటీ చెప్పులు( Slippers ) వాడడం అంటే తెగ ఇష్టమట.ఆమె ఇంట్లో ఉన్న చెప్పుల కలెక్షన్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాలిసిందే.

ఒక్కో చెప్పుల జత ధర లక్ష నుండి రెండు లక్షల రూపాయలకు పైగానే ఉంటుందట.ఎవరికైనా బట్టల పిచ్చి ఉంటుంది, మొబైల్స్ పిచ్చి ఉంటుంది, ఇవి రెండు కాకుండా చేతి వాచ్ పై వ్యామోహం ఉంటుంది, కానీ కైరా అద్వానీ కి ఈ చెప్పుల పిచ్చి ఏంటో అర్థం కావడం లేదని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.ఇక కైరా అద్వానీ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ సినిమాతో పాటుగా, ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2 ‘ లో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం లో ఆమె నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని ఒక టాక్ ఉంది.
అది ఎంతవరకు నిజమో చూడాలి.