నిన్న కృష్ణాజిల్లా తిరువూరు టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలను మరోసారి తెరపైకి తీసుకువచ్చాయి.
ఎప్పటి నుంచో విజయవాడ టిడిపి ఎంపీ నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది.నాని సోదరుడు చిన్నికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )అండదండలు ఉండడం, మిగతా నాయకులు ఎవరూ నానిని లెక్కచేయనట్లుగా వ్యవహరించడం వంటి పరిణామాలతో చాలాకాలంగా కేశినేని నాని సైలెంట్ గానే ఉంటున్నారు.
నిన్న పార్టీ కార్యాలయంలో నాని, చిన్ని వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది.ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
ఈ ఘటన లో తిరువూరు ఎస్సై సతీష్ తలకు బలమైన గాయం అయింది.ఈ వ్యవహారం పై కేశినేని నాని స్పందించారు.
పార్టీలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలో కొంతమంది తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా సైలెంట్ గానే ఉంటున్నానని చెప్పుకొచ్చారు.పార్టీ పొలిట్ బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి తనను గొట్టం గాడని అన్నా భరించానని, పార్టీ కోసమే ఓపిక పడుతున్నానని నాని ( kesieneni nani )అన్నారు.గతంలో తాను చాలా అవమానాలు పడ్డానని అన్నారు.
తిరువూరు నియోజకవర్గంలో నిన్న టిడిపి సమన్వ య సమావేశంలో గొడవ తరువాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం టిడిపి సమావేశం జరిగిన ప్రదేశాన్ని ఆ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు.ఈ వ్యవహారంపై నాని తీవ్రంగా స్పందించారు.‘ విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పుతీసుకొని కొడతా అన్నాడు.క్యారెక్టర్ ప్లస్ ఫెలో అన్న ఆ వ్యక్తి మాటలపైన పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు.
నన్ను అవమానించినా, పార్టీ కోసం నేను ఏ రోజు పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు.ఎప్పటి నుంచో పార్టీలో కుంపటి నడుస్తోంది.ఎక్కడో ఒక చోట పులిస్టాప్ పెట్టాలి.
ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయని నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా.తిరువూరు టిడిపి ఇన్చార్జ్ పూజకు పనికిరాని పువ్వు.
గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా.కేశినేని చిన్ని( Kesineni chinni )కి పార్టీకి ఏం సంబంధం.
అతను ఏమైనా పార్టీలో ఎంపీ నా ఎమ్మెల్యే నా , తిరువూరు ఇన్చార్జి పార్టీలో కేడర్ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు.అందుకే రియాక్షన్ వచ్చింది.
కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారు.నేను రెండుసార్లు ఎంపీగా గెలిచా.
రతన్ టాటా స్థాయి వ్యక్తిని నేను.బెజవాడ పేరు చెడగొట్టకూడదని ఓపిక పట్టా.
రాబోయే పరిణామాలు దేవుడు ప్రజలే చూసుకుంటారు ‘ అంటూ నాని వ్యాఖ్యానించారు.