తెలంగాణ ప్రజలు ఒక్కసారి షాక్ అయ్యారు ఎందుకో తెలుసా

రాజకీయాలలో దూకుడు స్వభావం ఒక్కటే కాదు.ఫైర్ బ్రాండ్ లా మాట్లాడటం మాత్రమే కాదు తెలివి తేటలు చాలా ముఖ్యం.

 Kcr Send Wishes To Revanth Reddy Birthday-TeluguStop.com

రాజమౌళి సినిమాలో ఒక డైలాగు గుర్తుకు వస్తుంది రాజకీయం రౌడి ఇజం ఒక్కటి కాదు అని.ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పని ఆ డైలాగుకి వర్తిస్తుంది అని చెప్పచ్చు.ఒక పక్క రేవంత్.కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చిన మాటలు అంటూ ఫైర్ అయ్యిపోతుంటే.కేసీఆర్ మాత్రం చాల సైలెంట్ గా తన అనుయాయులని కారు ఎక్కిస్తున్నారు

ఇప్పటి వరకు ఇదంతా అందరికి తెలిసిన విషయమే.కానీ ఇప్పుడు కేసీఆర్ రాజకీయంగా ఎంతో తెలివిగా అడుగులు వేస్తున్నాడు.

ఎక్కడ నెగ్గాలో.కాదు ఎక్కడ తగ్గి గెలవాలో కేసీఆర్ కి బట్టర్ తో పెట్టిన విద్య.

కేసీఆర్ ఎప్పుడు.ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ తెలియదు.

తాజాగా జరిగిన సంగటన ఇప్పుడు తెలంగాణా,ఏపీ రాజకీయాల్లో పిచ్చి ఎక్కిస్తున్నాయి.కేసీఆర్ సొంత పార్టీ నేతలకి దిమ్మ తిరిగి పోయింది.

ఇక కాంగ్రెస్ కి అయితే మైండ్ బ్లాక్ అయ్యింది అనే చెప్పాలి.విషయం ఏమిటి అంటే

రేవంత్ పేరు వింటేనే కాకెత్తి పోయే కేసీఆర్.

ఇప్పుడు రేవంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అదికూడా పుష్ప గుచ్చం ఇచ్చి మరీ.అంతేకాదు ఒక లెటర్ కూడా అందులో ఉంచారు.బుదవారం రేవంత్ కి శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్ ఇచ్చిన లేఖలో “దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి.

మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలి” అంటూ సందేశం ఇచ్చారు.ఈ లేఖతో రేవంత్ కి.కాంగ్రెస్ కి దిమ్మ తిరిగి పోయింది.రేవంత్ టిడీపిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు.

అందులోనూ ఓటుకు నోటు కేసు నుంచీ ఇద్దరికీ మధ్య గ్యాప్ మరీ పెరిగిపోయింది.ఇటువంటి సమయంలో ఈ శుభాకాంక్షలు లేఖ ఎందుకు పంపారో తెలియక అందరు జుట్లు పట్టుకున్తున్నారు.

ఎంతన్నా కేసీఆర్ రాజకీయం అంతుపట్టని విషయమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube