కవితను కేసీఆర్ పక్కనపెట్టేసినట్టేనా ? కారణం ఇదా వామ్మో

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కెసిఆర్ సీఎం గా, కుమారుడు కేటీఆర్ మంత్రిగా, కుమార్తె కవిత ఎంపీగా మొత్తం ఫ్యామిలీ అంతా వివిధ పదవుల్లో ఉంటూ ఎవరికి వారే తమ సత్తాను చాటుకున్నారు.కేసీఆర్ కు కేటీఆర్, కవిత ఇద్దరు బాగా కలిసి వచ్చేలా పార్టీలోను, ప్రభుత్వంలోను చేదోడు వాదోడుగా ఉండి టిఆర్ఎస్ మరింత బలోపేతం అయ్యేలా కృషి చేశారు.

 Kcr And Kavitha Latest News About Kavitha Rajya Sabha Seat-TeluguStop.com

అయితే రెండో సారి ఎన్నికల్లో మాత్రం అనుకోని విధంగా దెబ్బ తగిలింది.మొదటి ఎన్నికల్లో విజయం సాధించినా రెండో సారి మాత్రం బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు.

ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆమె ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు, వ్యవహారాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

Telugu Kavitha Kcr, Kavithaloose, Kcr Kavitha, Kcrkavitha, Telanganatrs-Politica

కానీ ఆమె లేని లోటు మాత్రం టిఆర్ఎస్ లో కనిపిస్తూనే ఉండడంతో కెసిఆర్ కుమార్తె కవితకు రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీని చేస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే వస్తోంది.ఇక కెసిఆర్ కూడా ఆ విధంగానే ఆమెను రాజ్యసభకు పంపించి ఢిల్లీలో గట్టిగా వాయిస్ వినిపించాలని చూశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

స్థానిక సంస్థలు, పంచాయతీలు, మునిసిపల్, సహకార ఎన్నికలు ఇలా అన్నిటిలోనూ కారు దూసుకుపోయింది.ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గ పరిధిలో అయితే పార్టీ ఓటమి చెందుతుందో ఓడితే వారి పదవులు పోతాయని కెసిఆర్ ముందే హెచ్చరించారు.

దీంతో నేతలంతా తమ స్థాయికి మించి కష్ట పడ్డారు.కానీ ఇప్పుడు మాత్రం నిజామాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన కవిత ను రాజ్యసభకు పంపించడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందినా తమ కూతురు కాబట్టి కెసిఆర్ ఆమెను రాజ్యసభకు పంపించారని, మిగిలిన వారి విషయాల్లో ఆ నియమాలను పాటించకుండా పక్కన పెట్టేస్తున్నారు అనే అభిప్రాయం కలగకుండా కేసీఆర్ ఇప్పుడు తన నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

అందుకే ఆమె కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

Telugu Kavitha Kcr, Kavithaloose, Kcr Kavitha, Kcrkavitha, Telanganatrs-Politica

తెలంగాణ నుంచి త్వరలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి.వాటికి సంబంధించి మార్చిలో ఈ రెండు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోనే పడడం ఖాయం.అయితే ఆ రెండు సీట్లలో ఎవరిని కేసీఆర్ ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో ఉంది.

ఇక ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం విషయంలో కవితను పక్కన పెట్టడంతో కవితకు ఏ పదవిని కెసిఆర్ కట్టబెడతారు లేక ఆమె రాజకీయాల్లో ఇలా మౌనంగానే ఉంటారా అనేది టీఆర్ఎస్ శ్రేణులకు సైతం అంతుబట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube