టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాకు పయనమైన భారత్ జట్టు..!!

ఆదివారంతో ఐపీఎల్( IPL ) టోర్నీ ముగియనుంది.సన్ రైజర్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 Indian Team Left For America For T20 World Cup, Usa, T20 World Cup, India Team,-TeluguStop.com

ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు పోటాపోటీగా జరిగాయి.కీలకమైన టీమ్స్ మొదట్లో రాణించగా తర్వాత.

చేతులెత్తేసాయి. బెంగళూరు రాయల్ చాలెంజర్స్.

పుంజుకున్నా గాని.క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.

చివర ఆఖరికి సన్రైజర్స్.కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కి చేరుకున్నాయి.

రేపు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇదిలా ఉంటే జూన్ రెండవ తారీఖు నుండి టి20 వరల్డ్ కప్ టోర్నీ( T20 World Cup ) జరగనున్న సంగతి తెలిసిందే.అమెరికా, వెస్టిండీస్( America, West Indies ) వేదికగా ఈ టోర్నీ జరగనుంది.ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ జట్టు ముంబై నుంచి యూఎస్ఏకు బయలుదేరింది.

ఈ టోర్నీలో భాగంగా రోహితశర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది.యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్ జూన్ 2న మొదలై జూన్ 29 వరకు కొనసాగనుంది.

రేపు ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న రెండు జట్లలోనూ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో భారత జట్టు యూఎస్ఏకు పయనం కావడం జరిగిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube