ఒక్క టీ షర్ట్ ఖరీదు రూ.40 వేలు.. నీ మొహంలా ఉందంటూ స్టార్ హీరోయిన్ పై ట్రోల్?

బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ కరీనా కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుకోవడమే కాకుండా సినిమాలలో తన అందం,అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది.

 Kareena Kapoor Trolled Flaunting Her Gucci Rs 40000 T Shirt , Kareena Kapoor, Bo-TeluguStop.com

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కరీనాకపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఇకపోతే కరీనా కపూర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

కరీనా కపూర్ ఎక్కువగా ఖరీదైనవి వస్తువులని వాడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

అయితే చాలా మంది హీరోయిన్ లు ఆన్‌ స్క్రీన్‌ అయినా ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు.

అలాంటి వారిలో కరీనాకపూర్ కూడా ఒకరు.మామూలుగానే హీరోయిన్లుపార్టీలకు ఈవెంట్లకు ఫంక్షన్లకు, బయటకు వెళ్లినా కూడా ఖరీదైన దుస్తులను ధరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వారు ధరించిన దుస్తులపై వారి స్టయిల్‌ పై విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్‌ కూడా ఈ విమర్శల బారిన పడింది.

Telugu Bollywood, Kareena Kapoor, Netizens, Trolls-Movie

ఇటీవల కరీనా గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట కనిపించడంతో,అక్కడున్న ఫొటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసారు.అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆ టీషర్ట్‌ దరిద్రంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.అయితే కరీనా 40 వేలు పెట్టి కొనుకున్న టీ షర్ట్‌ అష్ట దరిద్రంగా ఉందని పెదవి విరుస్తున్నారు నెటిజన్స్.నీ టేస్ట్‌ ఏడ్చినట్లుంది.మేము 150 పెడితే మూడు టీషర్ట్స్‌ వస్తాయి.నువ్వు వేసుకున్నదానితో పోలిస్తే అవే చాలా బాగుంటాయి అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.

కాగా కరీనా వార్డ్‌రోబ్‌లో గుస్సీ టీషర్ట్స్‌ 50 కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube