అప్పుడే జగన్ అభ్యర్దుల ఎంపికలు మొదలెట్టేశారా ?

తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతూ.2024 ఎన్నికల్లో తమను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సైతం అలర్ట్ అయ్యారు.

రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలన్నీటిని జగన్ వేగవంతం చేశారు.

ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం పేరుతో, అధికారులు వైసీపీ ప్రజా ప్రతినిధులు అందరూ జనాల మధ్య కు వెళ్లేలా చేశారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలను సూచించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా పని తీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగులుతున్నాయి.జగన్ సైతం వారికి పార్టీ కీలక నేతలతో క్లాస్ పీకించి వారిలో మార్పు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు.

ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏవిధంగా ఉందనేది జగన్ ముందుగానే తెలుసుకుంటున్నారు.దీనికి అనుగుణంగా మార్పుచేర్పులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా పనితీరు సక్రమంగా లేని  ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

Advertisement

దానికి ప్రత్యామ్నాయంగా ఆ నియోజకవర్గంలో బలమైన నేతలను గుర్తించే పనిలో ఉన్నారు.ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి పోయాయి.

నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులను నివేదికల రూపంలో అందించడంతో పాటు, అత్యంత ప్రజాదరణ కలిగి ఉండి ఆర్థికంగా స్తోమత లేక సైలెంట్ గా ఉంటున్న వారిని కలుస్తూ , వారి అభిప్రాయాలను నివేదికల రూపంలో పంపిస్తున్నారట.

ప్రజా బలం ఉన్నా.ఆర్థిక స్థోమత లేనివారిని పార్టీలో చేర్చుకుని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై జగన్ అప్పుడే కసరత్తు మొదలు పెట్టారు.ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టడంతో, వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరుగుతోంది.2024లో జరిగే సాధారణ ఎన్నికల కోసమో లేక ముందస్తు ఎన్నికల కోసమో తెలియదుగానీ, జగన్ అభ్యర్థుల ఎంపికపై మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టడంతో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఆశావాహులు టెన్షన్ పడుతున్నరట.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు