వారిద్దరూ స్టార్ హీరోలు కాగా అందులో ఒకరు యాక్షన్ హీరో అయితే,మరొకరు యూనివర్సల్ హీరో.ఒకరు రియల్ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సీన్లలో అదరగొడితే మరొకరు నటనలో విశ్వరూపం చూపిస్తూ మెస్మరైజ్ చేసేది ఇంకొకరు.
అలా ఆ ఇద్దరు స్టార్స్ 36 ఏళ్ల క్రితంమే చిత్రాలను సీక్వెల్‌గా తెరకెక్కించి ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలుగా రికార్డు సైతం క్రియేట్ చేశారు.మరీ ఆ స్టార్ హీరోలెవరో ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కమల్ హస్సన్ నటించిన విక్రమ్: ది హిట్ లిస్ట్ సినిమా 2022 జూన్ 3న విడుదలై ఎంతటి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
కమలహాసన్ కు దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఉలగ నాయగన్ మాసీవ్ కమ్‌బ్యాక్ హిట్ ఇచ్చింది.
అయితే ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మల్టీవర్స్ తరహాలో తెరకెక్కించారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ఇందులో కార్తీ ఖైదీ సినిమా సీన్లను చూపించడం, తర్వాత ఖైదీ 2 లో కూడా కమల్ హాసన్ విక్రమ్‌గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.
అంతేకాకుండా విక్రమ్ 3లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కమల్ హాసన్ ఒక ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు.అయితే కమల్ హాసన్ కు విక్రమ్ 3 అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ఇప్పటికే విక్రమ్ 2 వచ్చిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే నిజానికి విక్రమ్: ది హిట్ లిస్ట్ కన్నా ముందు 1986లో విక్రమ్ సినిమా వచ్చింది.ఇదే రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఏజెంట్ విక్రమ్ 007 రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ పాత్ర కొనసాగింపుగా తాజాగా విక్రమ్: ది హిట్ లిస్ట్ సినిమాను రూపొందించారు.అంటే తాజాగా విడుదల అయిన సినిమా 1986లో వచ్చిన ఏజెంట్ విక్రమ్ 007 చిత్రాల కథా నేపథ్యం ఒకే లైన్‌పై ఆధారపడింది.
దీన్ని బట్టి చూస్తే ఏజెంట్ విక్రమ్ 007సినిమాకు విక్రమ్ 2 సీక్వెల్ అని చెప్పవచ్చు.అప్పట్లోనే రూ.కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ.8 కొట్ల కలెక్షన్స్ ను సాధించింది.

ఇక తాజాగా విడుదల అయిన విక్రమ్: ది హిట్ లిస్ట్ సినిమా సుమారు రూ.120-150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, రూ.442.45 కోట్లు రాబట్టింది.కమల్ హాసన్‌లానే కెరీర్ ప్రారంభంలో స్ట్రగులై అదే 1986లో హిట్ కొట్టిన మరో స్టార్ హీరో టామ్ క్రూజ్.ఈ హీరోకు కూడా కెరీర్ ఆరంభంలో సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా టాప్ గన్.1986 మే 16న విడుదలైన టాప్ గన్ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.రూ.1.5 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రూ.35.73 కోట్లు రాబట్టింది.అయితే దాదాపుగా 36 ఏళ్ల తర్వాత టాప్ గన్ సినిమాకు సీక్వెల్‌గా టాప్ గన్: మావెరిక్ వచ్చి టామ్ క్రూజ్‌కు సాలిడ్ సక్సెస్ ఇచ్చింది.2022 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాప్ గన్: మావెరిక్ సుమారు 170 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సుమారు 1.131 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది.ఇక ఆరు పదుల వయసులోనూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న కమల్ హాసన్, టామ్ క్రూజ్ యాక్టింగ్, యాక్షన్ స్టంట్స్‌లో ఇద్దరూ ఇద్దరే అనిపించుకుంటున్నారు.