పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన తాజా చిత్రం కల్కి( Kalki ).డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Aswin ) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాజికల్ మూవీ జూన్ 27వ తేదీ విడుదల అయింది.
ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది.ఇక ఈ సినిమా ఇటీవల 1000 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక ఇదే విషయాన్ని నిర్మాతలు అధికారకంగా తెలియజేస్తూ ప్రభాస్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేశారు.
జూన్ 27వ తేదీ విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1000 కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు.ఇక ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయడమే కాకుండా ప్రభాస్ కర్ణుడిగా ఉన్నటువంటి ఒక పోస్టర్ ను విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన మూడవ తెలుగు సినిమాగా రికార్డులు సృష్టించింది.
ఇదివరకు 1000 కోట్లు సాధించిన తెలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం చిత్రం బాహుబలి2, అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి.ఇక మూడవ సినిమాగా కల్కి సినిమా వసూలు చేయడం విశేషం.ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ సీక్వెల్ సినిమా కూడా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని కూడా వీలైనంత తొందరగా విడుదల చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.