ప్రస్తుత కాలంలో కరెంట్ లేని గ్రామాలు దాదాపుగా ఉండవనే సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాలలో మాత్రం కరెంట్ లేని పరిస్థితి ఉంది.
అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న గ్రామాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.కొన్ని గ్రామాలలో కరెంట్ ఉన్నా కరెంట్ ఉండే సమయం కంటే కరెంట్ లేని సమయం ఎక్కువగా ఉంటుంది.
అలాంటి ఒక గ్రామంలో రోహిణి జన్మించారు.

తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా పచ్చమలై( Pachamalai )కు చెందిన రోహిణి( Rohini ) కూలి పనులు చేస్తూ చదువుకున్నారు, దీపం, టార్చ్ లైట్ వెలుగులో చదువుకున్న రోహిణి జేఈఈ పరీక్షలు రాసి మంచి ర్యాంక్ సాధించారు.చిన్న ఇలుప్పైయార్ లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖలో ప్లస్ 2 వరకు చదువుకున్న ఆమె ఎన్.ఐ.టీలో చేరాలని కల కని ఆ కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకోవడం జరిగింది.

మా ఊరులో కరెంట్ ఉండే సమయం చాలా అంటే చాలా తక్కువని మా ఊరిలో ఇంటర్నెట్, లైబ్రరీ లాంటి సదుపాయాలు లేవని రోహిణి తెలిపారు.రాత్రి సమయంలో టార్చ్ లైట్ వేసుకొని చదివేదానినని ఆమె చెప్పుకొచ్చారు.నీట్, క్లాట్, జేఈఈ పరీక్షలు రాశానని రోహిణి వెల్లడించారు.73.8 శాతం మార్కులతో జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని రోహిణి కామెంట్లు చేశారు.తిరుచ్చి ఎన్.ఐ.టీలో బీఈ కెమికల్ ఇంజనీరింగ్ సీటు వచ్చిందని ఆమె తెలిపారు.నా చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తానని చెప్పడం సంతోషం కలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు.
తిరుచ్చి ఎన్.ఐ.టీలో సీటు సాధించిన తొలి గిరిజన విద్యార్థి రోహిణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.రోహిణి సక్సెస్ స్టోరీ ఎంతోమంది గిరిజన విద్యార్థులలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
రోహిణి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.