టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి మనందరికి తెలిసిందే.కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.తల్లి అయిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఈ అమ్మడు ఓకే చెబుతోంది.
తాజాగా ఈ అమ్మడు నటించిన సత్యభామ సినిమా( Satyabhama Movie ) విడుదల అవ్వబోతుంది.లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన సత్యభామ ప్రమోషన్ లో కాజల్ పాల్గొంటుంది.
సత్యభామ ప్రమోషన్ లో భాగంగా అలీతో సరదాగా( Alitho Saradaga ) ప్రోగ్రామ్ కి హాజరు అయ్యింది.ఆ సందర్భంగా అలీతో కాజల్ పలు విషయాల గురించి మాట్లాడింది.ముఖ్యంగా తన మొదటి సినిమా ఆఫర్ ఆ సమయంలో తాను చేసిన ఆడిషన్స్ గురించి కాజల్ అగర్వాల్ సరదా విషయాన్ని చెప్పుకొచ్చింది.తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం ( Lakshmi Kalyanam Movie ) సినిమాలో ఎలా ఛాన్స్ వచ్చింది అంటూ అలీ ప్రశ్నించిన సమయంలో కాజల్ సమాధానమిస్తూ.
తేజ గారు నా ఫోటో చూసి ఆడిషన్స్ కి పిలిచారు.ఆడిషన్స్ లో నన్ను ఏం అడుగుతారా అని నేను ఎదురు చూశాను.ఆ సమయంలో నన్ను ఏడవమని చెప్పాను.
రీజన్ లేకుండా, ఏడ్చే ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవడం అనుకున్నాను.అప్పుడు మా నాన్న నా వద్దకు వచ్చి నేను ఏడ్చే ఒక విషయాన్ని చెప్పారు.అప్పుడు నాకు ఏడుపు వచ్చింది.
నేను బాగా ఏడ్చాను అని తేజ గారు లక్ష్మి కళ్యాణం సినిమాలో ఛాన్స్ ఇచ్చారంటూ కాజల్ సరదాగా చెప్పుకొచ్చింది.హీరోయిన్ లను తేజ గారు ఎంపిక చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని కాజల్ తెలిపింది.