ఎన్నికల కమిటీపై అప్పుడే అలకలు ! టి. కాంగ్రెస్ లో మళ్లీ మొదలు 

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో గ్రూపు రాజకీయాలు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి అని అంతా భావిస్తుండగా, మళ్లీ పరిస్థితి యథాతధంగా  మారిపోయినట్టుగానే కనిపిస్తోంది.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉండడంతో నాయకులంతా ఉత్సాహంగా ఉన్నారు.

 Just Waves On The Election Committee! T. Start Again In Congress, Telangana Cong-TeluguStop.com

గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టినట్టుగా కనిపించారు.అయితే కొద్ది రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

ఈ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ( Revanth Reddy )నియమించారు .అలాగే ఈ కమిటీలో ఏఐసిసి కార్యదర్శులు, పిసిసి మాజీ చీఫ్ లు సీఎల్పీ తో పాటు ,వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు .అయితే అదే కేటగిరిలో ఉండి కూడా అవకాశం రాని నేతలు తీవ్ర అసంతృప్తికి గురై ఇప్పుడు బహిరంగంగా అసంతృప్తిని  వెలగక్కేందుకు సిద్ధమవడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

Telugu Chinna Reddy, Pcc, Revanth Reddy, Telangana-Latest News - Telugu

ఈ కమిటీలో స్థానం దక్కకపోవడంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) తీవ్ర అసంతృప్తితో ఉన్నారట .ప్రభాకర్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ముగిసిన తరువాత ఇప్పటి వరకు ఆయనకు సరైన అవకాశం కల్పించకపోవడం, బహిరంగంగా ఆయన అసంతృప్తిని వెళ్లగక్కే ఆలోచనతో ఉన్నారట.అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా పేరుపొందిన మాజీ మంత్రి చిన్నా రెడ్డి( Chinna Reddy ) కి ఈ ఎన్నికల కమిటీలో అవకాశం దక్క లేదు.

ఏఐసిసి కార్యదర్శిలకు  దీంట్లో అవకాశం కల్పించి, అదే స్థాయిలో ఉన్న సీనియర్ నేత అయిన చిన్నారెడ్డిని పట్టించుకోకపోవడం ఏమిటనే చర్చ ఇప్పుడు జరుగుతోంది .మరో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్  కూడా ఎన్నికల కమిటీ నియామకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.  తనకు పార్టీ పదవిలో అవకాశం కల్పించకపోవడం పై అసహనంతో ఉన్నారట .

Telugu Chinna Reddy, Pcc, Revanth Reddy, Telangana-Latest News - Telugu

ఈ నియామకాల విషయంలో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది .ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పార్టీ పదవులు విషయంలో సీనియర్ నేతలే అలక చెందడం , గ్రూపు రాజకీయాలకు తెర తీయడం వంటివి బిజెపి, బీఆర్ఎస్ కు కలిసి వస్తాయని, కాంగ్రెస్ కు ఈ వ్యవహారాలన్నీ నష్టం చేకూరుస్తాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube