యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR )వరుస సినిమాలతో బిజీగా ఉండగా దేవర సినిమా ప్రమోషన్స్ ( Devara Movie Promotions )లో భాగంగా తారక్ ఇంటర్వ్యూలు ఇచ్చిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కౌశిక్ అనే తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.అయితే దేవర సినిమాను థియేటర్ లో చూడాలనేది తన కోరిక అని ఆ అభిమాని చెప్పుకొచ్చారు.
దేవర సినిమా ( Devara movie )రిలీజ్ అయ్యే వరకు తనను బ్రతికించాలని ఆ అభిమాని డాక్టర్లను కోరారు.అయితే ఫ్యాన్స్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి ఈ విషయం తెలియగా తారక్ వెంటనే కౌశిక్ కు వీడియో కాల్ చేయడంతో పాటు ధైర్యం చెప్పారు.
తారక్ వీడియో కాల్ లో కౌశిక్( Kaushik ) వేగంగా, ధైర్యంగా కోలుకుని బయటకు రావాలని కోలుకుని తల్లీదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని కామెంట్లు చేశారు.నేను నీతో మాట్లాడకుండా ఎట్లా ఉంటానంటూ తారక్ వెల్లడించారు.
తారక్ ను వీడియో కాల్ లో చూసిన వెంటనే కౌశిక్ సైతం తెగ సంతోషించారు.అన్నా.మిమ్మల్ని వీడియో కాల్ లో చూస్తానని అస్సలు అనుకోలేదంటూ కౌశిక్ కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఅర్ క్రేజ్ మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం అభిమానులు ఎంతగానో అభిమానిస్తున్నారు.తారక్ రేంజ్ ఎంతగానో పెరుగుతుండటం గమనార్హం.
అభిమానులకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో హిట్ సాధిస్తే ఫ్యాన్స్ మరింత సంతోషించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో సైతం గ్రేట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.