టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ! ఏ ఏ హామీలు ఇస్తున్నారంటే.. ? 

ఇప్పటికే ఏపీలో పొత్తు కొనసాగిస్తున్న టిడిపి , జనసేన పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలను ప్రకటించగా, 11 హామీలను కొత్తగా మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు.

 Joint Manifesto Of Tdp Janasena! What Guarantees Are Being Given, Tdp, Janasena,-TeluguStop.com

ఈ మేరకు టిడిపి జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం తాజాగా జరిగింది.టిడిపి నుంచి ముగ్గురు , జనసేన నుంచి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ భేటీ అయింది.

టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు( Yanamala Rama Krishnudu ), అశోక్ బాబు , పట్టాభి,  టిడిపి నుంచి హాజరుకాగా,  జనసేన నుంచి వరప్రసాద్,  ముత్త శశిధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధి మేనిఫెస్టో కమిటీ చర్చించి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు 10 లక్షల వరకు రాయితీ , ఆక్వా , ఉద్యాన,  పాడి రైతులకు మెరుగైన ప్రోత్సాహకాలు,  అమరావతి రాజధానిగా కొనసాగింపు , అలాగే పేదలకు ఉచిత ఇసుక కార్మిక సంక్షేమం , బీసీలకు రక్షణ చట్టం రద్దు చేసిన సంక్షేమ పథకాల పున పరిశీలన వంటివి మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్లు కమిటీ పేర్కొంది.

Telugu Ap Ap, Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpjanasena, Yanamalarama

 మొత్తం 11 అంశాలతో రెండు పార్టీలకు ఉమ్మడి మినీ మేనిఫెస్టో రూపొందించారు.120 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి.అలాగే జనసేన( Janasena ) ప్రతిపాదించిన ఐదు అంశాలను మేనిఫెస్టోలో  యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.తాజాగా రెండు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకున్న 11 అంశాలపై పిఎసిలు చర్చించి వివిధ వర్గాల సూచనలు,  సలహాలు తీసుకుని చంద్రబాబు పవన్( Chandra babu naidu ) ఫోటోలతో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నట్లు యనమల పేర్కొన్నారు.

  జనసేన నుంచి ఆరు అంశాలను ప్రతిపాదించినట్లు ఆ పార్టీ నేత మూత్తా శశిధర్ తెలిపారు .

Telugu Ap Ap, Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpjanasena, Yanamalarama

సంపన్న ఆంధ్రప్రదేశ్ , అమరావతి రాజధాని,  ఉచిత ఇసుక,  భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి,  జనసేన సౌభాగ్య పదం , నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ,వ్యవసాయ భాగ్య పదం ద్వారా రైతులు,  కవులు రైతులకు మేలు చేయడం,  మన ఆంధ్రప్రదేశ్ మన ఉద్యోగాలు లాంటి ఆరు అంశాలను ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతిపాదించినట్లు జనసేన నేత ముత్తా శశిధర్ తెలిపారు.పూర్తిస్థాయిలో మేనిఫెస్టోలో ప్రకటించిన తరువాత జనాల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube