కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం 19 మంది మృతి.. ఎన్నో వేల మంది..

కొన్ని వారాలుగా అగ్రరాజ్యమైన అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.భారీ వర్షాల దాటికి వరదలు సంభవిస్తున్నాయి.

 Joe Biden Declares Emergency For California Due To Winter Storms,joe Biden,winte-TeluguStop.com

డ్యాములు పొంగిపొర్లుతున్నాయి.దీనివల్ల అనేక ప్రాంతాలు జల మయమయ్యాయి.

రోడ్లు వాగులను తలపిస్తున్నాయి.వందలాది ఇండ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.చలికాలంలోనీ వర్షాలు దాటికి కాలిఫోర్నియాలో వరదలతో పాటు కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి.

పలు చోట్ల భూమికి పగుళ్లు వచ్చి భూమి లోపలికి కృంగిపోతోంది.తుఫాన్ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లు అధికారిక ప్రకటన చేశారు.

Telugu America, Calinia, Emergency, International, Joe Biden, Salinas River, Sto

కాలిఫోర్నియాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.సోమవారం కూడా తుఫాను ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ప్రజలు అప్రమంతంగా, జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది.కాలిఫోర్నియా తర్వాత ఈ తుఫాన్ లాస్ ఏంజల్స్ వైపు వెళ్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.కాబట్టి లాస్ ఏంజెల్స్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలను జారీ చేసింది.

Telugu America, Calinia, Emergency, International, Joe Biden, Salinas River, Sto

కాలిఫోర్నియాలో భారీ విపత్తు చోటు చేసుకున్నదని జో బైడెన్ ప్రకటించారు.ఆ రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించడంలో బాధితులకు తాత్కాలిక వసతి కల్పించారు.

కాలిఫోర్నియాను భారీ చలిగాలలో చుట్టుముట్టాయి.ఈ తుఫాను బీభత్సం వల్ల దాదాపు ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాలిఫోర్నియాలోని సాలినాస్ నది వరదలతో పరివాహక ప్రాంతాల్లో పొంగి పొర్లుతుంది.జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహిస్తూ ఉంది.

మరో తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో 24 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube