బాబు కూతురు పెళ్లైంది

హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన జగపతిబాబు తాజాగా తన కూతురు పెళ్లి జరిపించాడు.ఇప్పటి వరకు జగపతిబాబు ఫ్యామిలీ పెద్దగా మీడియా ముందుకు వచ్చింది కాని, ఇతర కార్యక్రమాల్లో కనిపించింది కాని లేదు.

 Jagapathi Babu’s Daughter Tied The Knot With Nri-TeluguStop.com

తాజాగా పెళ్లి సందర్బంగా జగపతిబాబు ఫ్యామిలీ మీడియాలో కనిపించారు.గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న జగపతిబాబు పెద్ద కూతురు మేఘన అక్కడే ఎన్నారై కుర్రాడితో ప్రేమలో మునిగి తేలింది.

వారిద్దరి ప్రేమకు జగపతిబాబు ఓకే చెప్పాడు.తాజాగా వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు.

కొంత మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరు అయిన ఈ వివాహం మార్చి 8న జరిగింది.ఈ వివాహ వేడుకలో హీరోయిన్స్‌ విమలారామన్‌, సోనియా అగర్వాల్‌ ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యి, వధు వరులను ఆశీర్వదించారు.

ప్రస్తుతం జగపతిబాబు హీరో పాత్రలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి విలన్‌గా మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube