ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఏ పని చేసినా కూటమి గజగజా వణుకుతోంది.సాధారణంగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు పెట్టుకున్న పార్టీలదే అధికారం అని ఎవరైనా భావిస్తారు.
అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు( TDP BJP Janasena Alliance ) పెట్టుకున్నా ఆ పార్టీలలో గెలుపునకు సంబంధించిన కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు.జగన్ మేనిఫెస్టోను( Manifesto ) ఆలస్యం చేస్తుండటంతో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించడం మరింత ఆలస్యమవుతోంది.
లేట్ చేస్తూనే జగన్ భలే షాకిస్తున్నాడుగా అంటూ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.జగన్ లేట్ గా మేనిఫెస్టోను ప్రకటించినా తన పార్టీ కార్యకర్తల ద్వారా సులువుగా హామీల గురించి ప్రచారం చేసేలా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.దాడులు ఆపలేవని అధికారం మనదేనని జగన్ తాజాగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 90 శాతం హామీలను అమలు చేసిన జగన్ ఇచ్చిన హామీలే తనను కచ్చితంగా గెలిపిస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కూటమి మేనిఫెస్టో డేట్ ను ప్రకటింకడానికి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీ ఓటర్లలో( AP Voters ) ప్రధానంగా మహిళలు, రైతులను టార్గెట్ చేసేలా జగన్ నిర్ణయాలు ఉండనున్నాయని తెలుస్తోంది.
మహిళలు, రైతుల మద్దతు పొందితే వైసీపీకి( YCP ) గెలుపు నల్లేరుపై నడక అవుతుందని చెప్పవచ్చు.కూటమిలోని భయాన్ని గుర్తించిన జగన్ కూటమికి షాకిచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని సమాచారం అందుతోంది.ఎన్నికలకు 28 రోజుల సమయం మాత్రమే ఉండటంతో జగన్ మరింత తెలివిగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఇచ్చే హామీలు ఒకింత భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది.కూటమి హామీలను కాపీ కొట్టకుండా వైసీపీ తెలివిగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే చంద్రబాబు( Chandrababu ) ప్రకటించిన హామీలు ఇతర పార్టీల హామీలకు కాపీ హామీలు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.