అధికార వైసీపీలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నాయకుడిగా ఉండడంతో పాటు … కేంద్రంలో పార్టీ తరఫున చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందిన రాజకీయ భీష్ముడు నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శకం ముగిసిందా ? ఇక, ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్టేనా ? అంటే.ఔననే అన్న వాతావరణమే వైసీపీలో కనిపిస్తోంది.
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న మేకపాటి.కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్రవేశారు.వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్నారు.జిల్లాలు మారినా ఆయన ఎంపీగా గెలిచారు.నరసారావుపేట, ఒంగోలు, నెల్లూరు ఇలా మూడు జిల్లాల నుంచి ఆయన లోక్‌సభకు ఎంపికయ్యారు.వైఎస్ మరణాంతరం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి చేరువయ్యారు.
ఎంపీగా ఈ పార్టీ నుంచి కూడా గెలిచారు.
వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం చూపించే రెడ్డి నేతల్లో మేకపాటి ఒకరు.
గతంలో 2014లో నెల్లూరు నుంచి విజయం సాధించిన తర్వాత.వైసీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ దాదాపు ఆయనే చూసుకున్నారు.అంతేకాదు.జగన్ వివిధ కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అటు పార్లమెంటులోను, ఇటు పార్టీ పరంగాను రాజమోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు.2014లో పార్టీ ఓడిపోయి.ప్రతిపక్షంలో ఉన్నాక ఢిల్లీలో జగన్, పార్టీ వ్యవహారాలు అన్నీ ఆయనే చక్క పెట్టేవారు.
అలాంటి సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఎంట్రీతో కనుమరుగు అయిపోయారు.

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీలందూ.రాజీనామాలు చేయాలని జగన్ అన్నప్పుడు మాత్రం ఒకింత వ్యతిరేకించారు.ఎంపీలుగా తాము రాజీ నామా చేస్తే.
హోదా వస్తుందా ? అని ప్రశ్నించారు.ఈ ఒక్కటి తప్ప.
మిగిలిన విషయాల్లో జగన్‌ను ఆయన ఏనాడూ విభేదించిన పరిస్థితి మనకు కనిపిం చదు.సీనియర్‌గా ఆయన ఇచ్చిన సలహాలు కూడా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో ఆయన చివర్లో పార్టీలో ఇమడ లేకపోయారు.
ఇక, గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు.అయితే.
ఆయన కుమారుడు గౌతం రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వడంతోపాటు.మంత్రిగా కూడా ఛాన్స్ ఇచ్చారు.
ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి సైతం ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు.తెలుగు రాజకీయాల్లో దశాబ్దాల పాటు కంటిన్యూ అవుతూ రాజకీయ భీష్ముడిగా వివాద రహితుడిగా గుర్తింపు పొందిన రాజమోహన్ రెడ్డి.
ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు.వృద్ధాప్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారనుకున్నా ఆయన మనసులో మళ్లీ రాజ్యసభ ద్వారా ఢిల్లీకి వెళ్లాలన్న కోరిక అయితే ఉందంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఆయన్ను పట్టించుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది ?
.