ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు అన్ని పార్టీల రాజకీయాలు మారిపోయాయి.మరీ ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఏది చెప్పాలనుకున్నా సోషల్ మీడియాను బలంగా వాడేసుకుంటున్నాయి పార్టీలు.
సోషల్ మీడియాలో యూత్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఇక్కడ తమ వాయిస్‌ను బలంగా వినిపించి ఇతర పార్టీల మీద వ్యతిరేకత తీసుకొస్తే గనక కచ్చితంగా యూత్ తమవైపు తిరుగుతుందని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ ఈ సోషల్ మీడియా వింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది.
ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ ఐటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నెట్టింట్లో టీడీపీ వాయిస్ బలంగా వినిపిస్తోంది.
ఎప్పటికప్పుడు వైసీపీ మీద గట్టి విమర్శలు చేస్తూ చాలామంది వైసీపీ మంత్రుల మీద వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా 500 మందితో బలంగా పనిచేస్తోంది.మంత్రుల లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ సెటిరికల్గా పోస్టులు పెడుతున్నారు.
కాగా ఈ 500మంది కూడా జీతాలకు పని చేస్తున్నారని సమాచారం.అందుకే ఇటీవల సోషల్ మీడియాలో జగన్ మీద ఎవరు పోస్టులు పెట్టినా నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ టీమ్ మొత్తం నిత్యం జనాల్లోకి ఏ విషయం అయితే బాగా వెళుతుందో రీసెర్చ్ చేసి దాన్నే పదే పదే ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే ఈ ఐటీడీపీకి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రెసిడెంట్లు కూడా నియామకం అయ్యారు.మండలానికో ఐటీడీపీ వింగ్ కార్యకర్తను నియమించారు.వీరంతా జీతాలకు పనిచేయడం వల్ల చాలా చురుగ్గా పోస్టులు పెట్టేస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ వైఫల్యాలు టార్గెట్ గా అఫీయల్ అకౌంట్లతోనే విమర్శలు సంధిస్తున్నారు.సొంత అకౌంట్లతో ఇలా కామెంట్లు, పోస్టులు చేయడం వల్ల నెటిజన్లు కూడా వారిని టీడీపీ అనుకూలస్తులుగా చూడట్లేదు.
ఇదే టీడీపీకి బాగా కలిసి వస్తోంది.