తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వ్యూహప్రతివ్యూహాలు తీవ్రచర్చనీయాంశం అవుతూతున్నాయి.అధికార బిఆర్‌ఎస్ ను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తుంటే.
ఆ రెండు పార్టీలను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.కాగా ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ కు కాంగ్రెస్ తీవ్ర పోటీనిచ్చేలా కనిపిస్తోంది.
అందుకే హస్తంపార్టీలోని కీలక నేతలకు చెక్ పెట్టేందుకు కేసిఆర్ అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు.ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటివారిని ఈసారి ఓడించేందుకు కేసిఆర్( CM KCR ) పక్కా ప్రణాళికలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి విషయంలో కేసిఆర్ మరింత శ్రద్ద పెట్టరాట.గత ఎన్నికల్లో కోడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ప్రత్యర్థి బిఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి( Patnam Narender Reddy ) చేతిలో ఓటమిపాలు అయ్యారు.
ఇక ఈసారి కూడా రేవంత్ రెడ్డి .
![Telugu Cm Kcr, Congress, Kodangal, Patnammahender, Patnamnarender, Revanth Reddy Telugu Cm Kcr, Congress, Kodangal, Patnammahender, Patnamnarender, Revanth Reddy](https://telugustop.com/wp-content/uploads/2023/08/Patnam-Narender-Reddy-Kodangal-cm-kcr-brs-party-Patnam-Mahender-Reddy-congress-party.jpg)
కోడంగల్( Kodangal ) నుంచే బరిలో దిగబోతున్నట్లు తేలిపోయింది.దాంతో రేవంత్ రెడ్డికి మళ్ళీ చెక్ పెట్టేందుకు కోడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ కే మళ్ళీ సీట్ కేటాయించారు కేసిఆర్.అయితే ఈసారి కోడంగల్ లో రవంత్ రెడ్డి గ్రాఫ్ అమాంతంగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.
రేవంత్ రెడ్డికూడా ఈసారి గెలుపు విషయంలో ద్యామ్ ష్యూర్ గా ఉన్నారు.అటు బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై కోడంగల్ లో కొంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నట్లు టాక్.
ప్రజలకు అందుబాటులో ఉండరని, సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే టాక్ అక్కడక్కడ వినిపిస్తోంది.
![Telugu Cm Kcr, Congress, Kodangal, Patnammahender, Patnamnarender, Revanth Reddy Telugu Cm Kcr, Congress, Kodangal, Patnammahender, Patnamnarender, Revanth Reddy](https://telugustop.com/wp-content/uploads/2023/08/Kodangal-cm-kcr-brs-party-Patnam-Mahender-Reddy-congress-party.jpg)
దాంతో ఈసారి కోడంగల్ లో బిఆర్‌ఎస్ కు ఓటమి తప్పదా అనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి కూడా కోడంగల్ లో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి కేసిఆర్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.నియోజిక వర్గంలో పట్నం నరేందర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ఆ బాద్యతను మంత్రి మహేందర్ రెడ్డికి( Patnam Mahender Reddy ) అప్పటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
గత ఎన్నికల టైమ్ లో కోడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి గెలుపులో ఆయన అన్న మహేందర్ రెడ్డి పాత్ర చాలా ఉంది.అందుకే ఈసారి కూడా మహేందర్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని కేసిఆర్ వ్యూహరచన చేసినట్లు వినికిడి.
అందులో భాగంగానే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కూడా కట్టబెట్టినల్టు తెలుస్తోంది.మరి సారి కోడంగల్ బరిలో రేవంత్ రెడ్డికి కేసిఆర్ గతంలో మాదిరిగానే చెక్ పెడతారా అనేది చూడాలి.