ఔను! టీడీపీలో ఇప్పుడు ఇదే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తాను సొంతగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.నేరుగా ఒక విషయాన్ని ప్రకటించలేకపోతున్నారు.
ఇలా చేస్తే.పార్టీ నేతలు ఎక్కడ జారిపోతారో.
అని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.నిజానికి నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీగా టీడీపీని అభివర్ణించిన చంద్రబాబు.
ఇప్పుడు ఒక్క నేతను కూడా తయారు చేసే పరిస్థితి కనిపించడం లేదు.పైగా పార్టీలో గ్రూపు రాజకీయాలను ఆయన అరికట్టలేక పోతున్నారు.
ఈ క్రమంలో పార్టీ ఎక్కడికక్కడ కకావికలం అవుతోంది.అంతేకాదు.నాయకులు ఎవరిదారిలో వారు వ్యవహరిస్తున్నారు.గత ఎన్నికలకు ముందు చంద్రబాబుపై ఉన్న గౌరవం.
మర్యాద కూడా ఇప్పుడు నాయకుల్లో కనిపించడం లేదు.అదేసమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్న వారు కూడా తగ్గిపోయారు.
పైగా ప్రజల్లోకి వెళ్తున్నవారు కూడా కనిపించడం లేదు.చంద్రబాబుచెబుతున్న మాటలను చేస్తున్న వ్యాఖ్యలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు.
తమ అవసరం ఉంటే.మీడియా ముందుకు వస్తున్నారు.
లేదంటే.మౌనం పాటిస్తున్నారు.

పైగా పార్టీలో పదవులు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోలేక పోయిన వైనం.ఈ పరిణామాలకు అద్దం పడుతోంది.అయినా.కూడా చంద్రబాబు మాత్రం ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది.ఎవరిని ఏమంటే.ఎవరు బయటకు వెళ్లిపోతారో.
అని ఆయన ఆందోళనతో ఉన్నారు.మరీ ముఖ్యంగా తన కుమారుడిని ప్రొజెక్టు చేసుకునేందుకు ఆయన చూపుతున్న ఉత్సాహం.
పార్టీలో ఉన్న గ్రూపులను సరిదిద్దేందుకు ఆటంకంగా మారిందనే వాదన ఉన్నా.పట్టించుకోవడం లేదు.
వెరసి.అధికార పార్టీ ముందు.
ప్రతిపక్షంగా చంద్రబాబు అన్ని విధాలా ఫెయిలయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.