ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మన దేశ సరికొత్త పొలిటికల్ మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తించకపోవడంపై పెద్ద దుమారమే రేగింది.ఆఖరికి జమ్ము కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం మ్యాప్ విడుదల చేసింది.
అందులో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి తప్ప ఏపీ రాజధాని అమరావతి ఎక్కడ కనిపించలేదు.
దీనిపై ఏపీ వైసీపీ ఎంపీ ఎంపీ మిధున్ రెడ్డి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
ఈ మేరకు రెండు రోజుల కిందటే స్పీకర్ ఓం బిర్లాకు జీరో అవర్లో ఈ ఇద్దరు ఎంపీలు నోటీసులు అందించారు.అమరావతి విషయంలో ఇప్పటికే నిర్మాణం ఆలస్యం అయ్యింది అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ లో అమరావతిని గుర్తించలేదని వీరు ఆందోళన చేశారు.
తాజాగా దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
లోక్ సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తప్పుని సరి చేసి ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్ ను రూపొందించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం తన ట్విట్టర్లో ఈ మ్యాప్ ను విడుదల చేశారు.