పదవి నుండి తొలగించూ టయే మా పార్టీ పరిధిలోని అంశంకాదు.కాంగ్రేస్ పార్టీ సభ్యత్వానికి క్రెడిబులిటీ లేదు.జాతీయ స్థాయిలో రానున్న 11 వ తేదీన ఆ పార్టీ లో తిరుగుబాటు మొదలుకానుంది.2సార్లు ఎన్నికల్లో ఓడినప్పటికీ మహేశ్వర్ రెడ్డికి బుధ్ధిరాలేదు.ఆయనవన్నీ అసత్య ప్రచారాలే.నిన్న నిర్మల్ లో జరిగిన కాంగ్రేస్ సమావేశానికి ఆ పార్టీ కార్యకర్తలే రాలేదు.జనం లేక వెలవెల బోయింది.
వచ్చే 10 వ తేదీన వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో BJP బలం తేలిపోనుంది.
దేశానికి KCR మాత్రమే సమర్థ వంతమైన నాయకుడు కాగలడు.అందుకే KCR ను పలువురు CM లు, పార్టీల నేతలు సమర్థిస్తున్నారు.
మైనర్ బాలికపై అత్యాచార ఉదంతంలో నిందితుణ్ణి నేను కాపాడుతున్నానని, నా ప్రోద్బలం తోనే ఇలాంటివి చోటు చేసుఉంటున్నాయని BJP నాయకుల మాట్లాడుతున్నారు.BJP లో గూండాలు, క్రిమినల్స్ లేరా.
ఆ పార్టీ ఏకంగా మాఫియా డాన్ ల తోనే అంటకాగుతోంది.BJP కి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అన్నాడు.రాజాసింగ్ ఓటర్లను తన అయ్యసొమ్ము అనుకుంటున్నాడా.