మలయాళంలో నటించిన సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటులలో ఫహద్ ఫాజిల్ ఒకరు.ఫహద్ ఫాజిల్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చాలామంది భావిస్తారు.
ఇతర భాషల నుంచి కూడా ఫహద్ ఫాజిల్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.పుష్ప ది రైజ్ సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫహద్ ఫాజిల్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే పుష్ప విలన్ గురించి షాకింగ్ రూమర్లు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి.మలయాళంలో విలక్షణ నటుడిగా ఫహద్ ఫాజిల్ గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాపులారిటీని పెంచుకున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటించిన సినిమాలేవీ థియేటర్లలో విడుదల కావడం లేదు.అన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఫహద్ ఫాజిల్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఎగ్జిబిటర్లు సైతం ఫహద్ ఫాజిల్ విషయంలో ఆగ్రహంతో ఉన్నారని సమాచారం అందుతోంది.విక్రమ్, పుష్ప మినహా ఫహద్ నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.
భవిష్యత్తులో ఫహద్ సినిమాలను కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకోవాలని కొంతమంది ఎగ్జిబిటర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు ఫహద్ ఫాజిల్ త్వరలో పుష్ప2 సినిమా షూట్ లో పాల్గొననున్నారు.
బన్నీ ఫహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్లు పుష్ప2 సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ కోసం ఫహద్ ఎక్కువ సంఖ్యలో కాల్షీట్లు కేటాయించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.పుష్ప ది రూల్ సినిమా పుష్ప ది రైజ్ తో పోల్చి చూస్తే రెట్టింపు బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.మలయాళ ఎగ్జిబిటర్లు ప్రస్తుతం పుష్ప విలన్ ను కక్కలేక మింగలేక భరిస్తున్నారని తెలుస్తోంది.