అమెరికా యూనివర్సిటీ భారతీయుడి భారీ విరాళం...!!

అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి భారత సంతతి దంపతులు దాదాపు 7 కోట్లు విరాళంగా ప్రకటించారు.ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త రామానుజన్ పేరిట సదరు యూనివర్సిటీ లో గణిత విభాగంలో ప్రొఫెసర్‌షిప్‌ను ప్రారంభించడం ఈ భారీ విరాళం అందించినట్టుగా వారు తెలిపారు.

 Indian Mathematician Wife Give 1 Million Dollrs To Us University-TeluguStop.com

గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస్ రామానుజన్ పై ఉన్న గౌరవం తోనే తాము ఈ పని చేస్తున్నామని అదే యూనివర్సిటీ లో పని చేస్తున్న వరదరాజన్ తెలిపారు.విజిటింగ్‌ ప్రొఫెసర్‌షిప్‌ను ప్రారంభించడానికి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త వరదరాజన్‌, ఆయన భార్య వేద పూనుకున్నారని అధికారులు చెప్పారు.

అయితే వర్సిటీ ఆమోదం తెలిపిన తరువాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు.ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న వర్సిటీ శత వార్షికోత్సవాల్లో భాగంగా దీనిని ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న వరదరాజన్ మద్రాసు వర్సిటీలో ఎమ్మెల్సీ , కలకత్తా లో పీహెచ్.డీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube