ఎఐసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణలో పర్యటించారు.ఎన్నికల శంఖారావంలో పాల్గొని తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రాహుల్ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించాడు.ఈ ఐదేళ్ళ కాలంలో మోడీ దేశాన్ని సర్వ నాశనం చేసాడని, ఆర్ధికంగా, సామాజికంగా దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాడని రాహుల్ తీవ్ర విమర్శలు చేసాడు.
దేశంలో ఓ 15 మంది సంపన్నుల కోసం మాత్రమె మోడీ పని చేస్తున్నారని, సామాన్య, మధ్య తరగతి ప్రజలని మరింత కష్టాలలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు.
ఇక పుల్వామాలో ఉగ్రదాడి జరిగితే మోడీ తన ప్రమోషన్ కోసం ఫోటో షూట్ తీయించుకునే పనిలో వున్నారని, అలాంటి వ్యక్తి తమ దేశ భక్తి గురించి విమర్శలు చేస్తున్నారన దయ్యబట్టారు.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబం తమది, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రధానులు వున్నా కుటుంబం నుంచి వచ్చా అలాంటి తన దేశభక్తి గురించి మోడీ ప్రశ్నించడం హాస్యాస్పదంగా వుందని విమర్శించారు.ఓ వైపు సైనికులతో రాజకీయం చేస్తూ స్వలాభం పొందే ప్రయత్నం చేసే మోడీ మరో వైపు చైనా దగ్గర చేతులు కట్టుకొని వుంటారు.
అలాంటి మోడీ మన దేశాన్ని ఎలా కాపాడుతారు.ఇక తెలంగాణ సిఎం కేసీఆర్ మోడీకి సామంత రాజుగా మారిపోయాడు అని రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు.