తెలుగమ్మాయి పై గెలుపుకోసం 65 కోట్లు ఖర్చు

అమెరికాలో ఈ తెలుగు అమ్మాయి విజయం గనుకా నమోదయితే ఇది చారిత్రాత్మకం అవుతుందనడం లో సందేహం లేదు.ఎందుకంటే.

 Indian American Engineer To Contest From Maryland For Us Congress Seat-TeluguStop.com

ఆమె ఓటమి కోసం ప్రత్యర్ధి ఏకంగా 65 కోట్లు ఖర్చు చేశాడు.ఆమె మాత్రం కేవలం 9 కోట్లు ఖర్చు చేసింది.

అయితే గెలుపు మాత్రం తెలుగమ్మాయినే వరించనుందని తెలుస్తోంది.ఇంతకీ అసలు వివరాలలోకి వెళ్తే…అరుణా మిల్లర్‌ నే భారతీయ సంతతికి చెందినా కృష్ణా జిల్లా తెలుగు అమ్మాయి అమెరికా ప్రతినిధుల సభలో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అరుణా చిన్నతనం నుంచీ అమెరికాలోనే చదివింది…ఐబీఎంలో మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు పిల్లలను తీసుకుని 1972లోనే అమెరికా వెళ్లి వెళ్ళిపోయారు.అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు…అయితే అరుణ మేరీల్యాండ్‌ లోని డెమొక్రాట్ల కంచుకోట అయిన ఆరో జిల్లా ప్రైమరీకి ఆమె పోటీలో ఉన్నారు.ఈ సారి పార్టీలో ఆమె ప్రత్యర్థి డేవిడ్‌ ట్రోన్‌.

డేవిడ్‌ ట్రోన్‌.

అత్యంత సంపన్నమైన వ్యక్తి.ఒక వ్యాపారవేత్త అయితే తన గెలుపుకోసం ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు చేశారు.అయితే తానూ అంత ఖర్చు చేశాడంటే ఆమె వైపు అక్కడి ప్రజలు ఎంతటి ఆసక్తిని చూపుతున్నారో ఆర్థం అవుతోంది అంటున్నారు.

అయితే అరుణ- ట్రోన్‌ల పోటీపై అమెరికా అంతటా విస్తృత చర్చ జరుగుతోంది.ఆమె విజయం దాదాపుగా ఖరారేనని అనేక అమెరికన్‌ పత్రికలు రాస్తున్నా 26న జరిగే ఎన్నికల తర్వాత గానీ తుది ఫలితం వెల్లడి కాదు.

అరుణ 1990లోనే మౌంటెగ్మేరీ కౌంటీలో మేరీల్యాండ్‌ వెళ్లిన ఆమె -కాలేజీలో తాను ప్రేమించిన డేవిడ్‌ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు.సేవాకార్యక్రమాలలో ముందు ఉండే అరుణ 2004లో డెమొక్రటిక్‌ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

ఇప్పుడు అమెరికా చట్టసభలలో ఆమె గనుకా విజయం సాధిస్తే మాత్రం ఈ ఘటన సాధించిన రెండవ భారతీయురాలిగా చరిత్రకి ఎక్కుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube