ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి ఏకంగా కడుపున పుట్టిన బిడ్డలని పొట్టన బెట్టుకుంటున్నారు.తాజాగా ఓ మహిళ తన ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో కొడుకు వచ్చి విసిగిస్తున్నాడనే కారణంతో కామాందకారంలో ఉండి చివరికి తన కన్న కొడుకునే విషయాన్ని మర్చిపోయి ఏకంగా ఆ బాలుడిని హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కోయంబత్తూరు పరిసర ప్రాంతంలో దివ్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది.అయితే ఈ మధ్యకాలంలో తన భర్తతో విభేదాల కారణంగా విడిపోయి వేరుగా ఉంటుంది.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో దివ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.దీంతో అప్పుడప్పుడు యువకుడు దివ్య ఇంటికి వచ్చి వెళుతూ రాసలీలలు సాగించాడు.
అయితే తాజాగా మరోసారి యువకుడు మరియు దివ్య ఇద్దరూ కలిసి రాసలీలల్లో మునిగి తేలుతుండగా మధ్యలో వచ్చి దివ్య కొడుకు దివ్యని విసిగించసాగాడు. దీంతో ఆగ్రహానికి గురైన అటువంటి దివ్య కామంతో కళ్ళు మూసుకుపోయి కన్నబిడ్డని కూడా చూడకుండా బలంగా గాయపరిచింది.
దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో భయపడిన దివ్య వైద్య సిబ్బందికి సమాచారం అందించింది.వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించే లోపే బాలుడు మరణించాడు.అయితే బాలుడిపై ఉన్నటువంటి గాయాలను చూసినటువంటి వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు దివ్యని అదుపులోకి తీసుకొని విచారించగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన కొడుకుని తామె కడ తేర్చినట్లు నేరం అంగీకరించింది.
దీంతో దివ్య పై ఫిర్యాదు నమోదు చేసుకొని మరియు ఆమె ప్రియుడు ని కూడా అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.