ఈ ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి.కొన్ని కోట్లలో శాలరీలు కూడా అందిస్తుంటాయి.
మరికొన్ని ఉద్యోగాల్లో రోజులో కొన్ని నిమిషాలు పని చేస్తే చాలు.కొన్ని ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు లాగానే కనిపించవు కానీ అవి చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు.
ఈ విచిత్రమైన జాబ్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోక తప్పదు.అలాంటి ఒక వింత జాబ్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
సాధారణంగా మీరు పెళ్లిళ్లు కుదిర్చే వ్యక్తుల గురించి వినే ఉంటారు, మ్యారేజి బ్రోకర్స్( Marriage brokers ) పేరిట వీళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలుపుతారు.వారిద్దరికీ పెళ్లిళ్లు చేస్తారు.
అయితే పెళ్లిళ్లు చెడగొట్టి డబ్బు తీసుకునే వ్యక్తులు ఉన్నారని విన్నారా? స్పెయిన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి పని చేసి చాలా డబ్బు సంపాదిస్తున్నాడట.తన విచిత్రమైన జాబ్ గురించి ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

ఆ వ్యక్తి పేరు ఎర్నెస్టో.( Ernesto ) ఆయన చెప్పినదాని ప్రకారం, కొంతమంది తమ వివాహ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు, కానీ మరికొంతమందికి వివాహం ఒక కష్టమైన అనుభవం.ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులే ఆయన కస్టమర్లు.ఎర్నెస్టో అనే వధూవరులు పెళ్లి బంధంతో ఒకటి కాకుండా విడగొట్టడానికి సుమారు 46,645 రూపాయలు తీసుకుంటాడట.పెళ్లి ఎక్కడ జరుగుతుందో అంతా ఆయనకు చెప్పాలి.ఆ తర్వాత, పెళ్లి జరుగుతున్న సమయానికి కచ్చితంగా అక్కడకు వెళ్లి పెళ్లి ఆగేలా చేస్తాడట.
ఆయన చెప్పినదాని ప్రకారం, చాలా మంది అమ్మాయిలు లేదా అబ్బాయిలే ఆయన్ని ఈ పని చేయమని అడుగుతారు.వాళ్ళకు అది మంచిదే అని అనుకుంటారట.
ఆయన దగ్గర చాలా మంది కస్టమర్లు ఉన్నారట, అందుకే ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటాడట.

ఎర్నెస్టో ఓ వీడియోలో “మీకు పెళ్లి చేసుకోవాలా వద్దా అని సందేహాలు ఉన్నాయా? లేదా పెళ్లి చేసుకోకూడదని చెప్పడానికి కష్టంగా ఉందా? అయితే మీరు చింతించవద్దు, నేను మీ పెళ్లిని రద్దు చేస్తాను.” అని చెప్పాడు.ఆయన ప్రకారం, పెళ్లి జరుగుతున్న సమయంలో ఆయన అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు.
ఆ తర్వాత వారితో కలిసి పారిపోదాం అని అడుగుతాడు.ఆయన అంత బాగా నటిస్తారు కాబట్టి చాలా పెళ్ళిళ్లు ఆగిపోతాయట.ఎర్నెస్టో ప్రకారం, ఎవరైనా ఆయన్ని కొట్టితే లేదా తన్నితే అదనంగా డబ్బు ఇవ్వాలట.ఒకసారి కొట్టితే సుమారు 4,664 రూపాయలు ఇవ్వాలట.ఆయన చెప్పినట్లు, “నేను పారిపోవడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎక్కువగా కొట్టితే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి నేను నెమ్మదిగా నడుస్తాను.” నవంబర్ 2 వరకు ఆయనకు పనులు బాగా ఉన్నాయని ఆ వార్తా కథనంలో చెప్పారు.