అక్క‌డ టీకా తీసుకోకుంటే గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఊడిపోద్ది..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళిని… కరోనా మహమ్మారి భయబ్రాంతికి గురి చేస్తుంది.ఎంతో మంది ఈ మహమ్మారి దెబ్బకు ప్రాణాలు ఒదిలారు.

 If You Don't Get Vaccinated There You Will Lose Your Government Job Covid Tika,-TeluguStop.com

ఎంతో మంది ఆస్పత్రులలో చేరి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.ఇలా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించి టీకాను అభివృద్ధి చేశారు.

తీరా టీకా అందుబాటులోకి వచ్చాక కొంత మంది అనుమానంతో ఈ టీకాలను తీసుకోవట్లేదు.కరోనా నుంచి ఎంతో కొంత గట్టెక్కించే టీకాను తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా కానీ వినట్లేదు.

కానీ ఒక ప్రదేశంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులు టీకా వేయించుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోల్పోతారని గవర్నమెంట్ చెప్పడంతో చేసేదేం లేక విధిగా అందరూ టీకా తీసుకుంటున్నారు.అసలు ఇలా రూల్ పెట్టింది ఎక్కడంటే.

ఇలా టీకా వేసుకోలేదో గవర్నమెంట్ జాబ్ ఊడుతుందంటూ ఫిజి దేశంలో కఠిన ఆంక్షలు విధించారు.టీకా తీసుకోని వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా ప్రకటించడం గమనార్హం.

ఇన్ని రోజులు ప్రజలను కంగారు పెట్టించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తున్నా త్వరలోనే థర్డ్ వేవ్ రూపంలో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.అంతే కాకుండా ప్రస్తుతం విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ భయాలతో కూడా అందరూ టీకాలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కరోనా టీకా తీసుకోని వారి ప్రభుత్వ ఉద్యోగాలు తీసేస్తామని ఫిజి ప్రధాని ప్రకటించారు.అంతే కాకుండా ఆగస్టు 15 వరకు కూడా మొదటి డోసు కరోనా టీకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సెలవు మీద వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక నవంబరు ఫస్ట్ వరకు రెండో డోస్ టీకా వేయించుకోవాలన్నారు.అలా వేయించుకోని ఉద్యోగస్తులను నిర్ధాక్షిణ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసేస్తామని హెచ్చిరించారు.

Telugu Corona Wave, Covid, Covid Tika, Fiji, Lose Jo, Pmfrank, August-Latest New

ఇక తమ దేశంలో కరోనా టీకా విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించని ప్రైవేటు కంపెనీలను మూసేస్తామని ప్రకటించారు.9.3 లక్షల జనాభా ఉన్న ఫిజిలో ఇప్పటివరకు కేవలం 3.4 లక్షల మందే టీకాలు తీసుకున్నారు.దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా మంది టీకాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు.దీంతో విసిగిపోయిన ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube