ఇప్పటి వరకు కొరియన్ కంపెనీలలో స్త్రీలు పనిచేసే దాఖలాలు లేవు.ఎందుకంటే అక్కడ అలా వారు పనిచేయడానికి పర్మిషన్ లేదు.
అక్కడి స్త్రీలు ఇంటి పనులకే పరిమితం.అయితే ఇపుడిపుడే అక్కడ కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అవును, కొరియన్ ఆటో బ్రాండ్ హ్యుందాయ్( Hyundai ) దక్షిణ కొరియాలోని ఆటో తయారీ ప్లాంట్‌లో చరిత్రలో మొదటిసారిగా మహిళా కార్మికులను( Women Employees ) నియమించుకొని వివక్ష సంకెళ్లను తొలగించింది.లింగ సమానత్వాన్ని మెరుగుపరచడానికి యూనియన్లు ఇంకా కార్యకర్తల నుండి వచ్చిన ఒత్తిడిని అనుసరించి తాజాగా ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ఒక వెబ్ సైట్ పేర్కొంది.

ఉత్పత్తి ఇంకా విక్రయాల పరంగా హ్యుందాయ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కావడం గమనార్హం.కంపెనీలో కొత్తగా 200 మంది టెక్నీషియన్లు చేరడంలో భాగంగా ఈ నియామకం జరిగినట్టు భోగట్టా.దక్షిణ కొరియాలోని( South Korea ) సబ్ కాంట్రాక్టర్లు మాత్రమే మహిళలను సాంకేతిక నిపుణులుగా నియమించుకున్నారని తెలుస్తోంది.తాత్కాలిక ఉద్యోగులుగా ఈ పాత్రలో మహిళలను నియమించబడ్డారు.హ్యుందాయ్ ఇప్పుడు తన స్వంత దేశంలో దాదాపు 500 మంది టెక్నీషియన్‌లకు తలుపులు తెరిచేందుకు సిద్ధంగా ఉందని కూడా తెలుస్తోంది.అలాగే చివరికి పెద్ద సంఖ్యలో మహిళలు శాశ్వత శ్రామికశక్తిలో భాగం అవుతారని ఆ పత్రిక వెల్లడించింది.

హ్యుందాయ్ కంపెనీ మహిళల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం కొసమెరుపు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్ల తయారీదారులు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి విస్తృతంగా కృషి చేసే భాగంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది.హారియర్ అండ్ సఫారీ SUVలు మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ్ ప్లాంట్‌లోని టాటా మోటార్స్ కొత్త అసెంబ్లీ లైన్‌లోని కొత్త ఒమేగా ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డాయి.అత్యాధునిక కొత్త అసెంబ్లీ లైన్‌లో ఈ కఠినమైన SUVలను ఉత్పత్తి చేసే ఈ కార్ అసెంబ్లింగ్ లైన్‌లో కేవలం మహిళా కార్మికులు మాత్రమే ఉండడం విశేషం.