ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఓ వైపు పార్టీల ఎన్నికల ప్రచారాలు.
మరోవైపు వివిధ సంస్థల సర్వే ఫలితాలు వస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడా చూసినా వైఎస్ జగన్( YS Jagan ) గాలి బాగా వీస్తుందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ మేమంతా సిద్ధం’( Memantha Siddham ) బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జగన్ బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.
ఇప్పటికే ‘సిద్ధం ’ సభలకు ఏపీ ప్రజలు నీరాజనం పట్టగా.ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్రకు ప్రజాభిమానం కడలిలా పొంగుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
జగన్ బలంగా ఉండే రాయలసీమ ప్రాంత వాసుల అభిమానం కంటే గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు అభిమానమే ఎక్కువగా ఉంది.ప్రస్తుతం ఆయన యాత్ర కోసం తరలివస్తున్న జన ప్రభంజనాన్ని చూస్తే ఇది తెలుస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
జగన్ ప్రజల్లోకి వచ్చిన తొలి రోజుల నుంచి జనవాహిని ఆశేషంగా పెరుగుతోంది.పేదలు, మహిళలు, విద్యార్థులు మరియు యువత ఇలా ప్రతి ఒక్కరూ జగన్ కోసం కదులుతున్నారు.బస్సు యాత్రలో భాగంగా జగనన్నకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.పేదలు, అక్కాచెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లని జగన్ పలుసార్లు తెలిపారు.ప్రజలతోనే తన పొత్తు అని.రాబోయే ఎన్నికలు కురుక్షేత్రం తరహాలో జరుగుతాయని పేర్కొన్నారు.అంతేకాదు ప్రతి కుటుంబంలో మంచి జరిగితేనే తమ బిడ్డగా తనను మరోసారి ఆశీర్వదించాలని జగన్ కోరుతున్నారు.
మరోవైపు విపక్షాలన్నీ కలిసి జగన్ ను ఓడించేందుకు ఏకతాటిపై వచ్చాయి.స్టార్ క్యాంపెయినర్లుగా చంద్రబాబు,( Chandrababu ) పవన్ కల్యాణ్,( Pawan Kalyan ) బాలకృష్ణ( Balakrishna ) వంటి వారు పర్యటనలు చేస్తున్నప్పటికీ వారికి అంత జనాదరణ కనిపించడం లేదని తెలుస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా విపక్షాలకు జనబలం లేదని ఏపీ ప్రజలు చెబుతున్నారు.
దీన్ని బట్టే ఏపీలో మళ్లీ వచ్చేది ఎవరనే విషయం అర్థం అవుతుందని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని సమాచారం.
కుల, మత, పార్టీలకు అతీతంగా.
లంచాలు, వివక్ష లేకుండా ప్రతి గడప ముందుకు సంక్షేమాన్ని అందించిన జగనన్న పాలనపైనే ప్రజలు ఉన్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీలో ఫ్యాన్ ప్రభంజనమే కొనసాగుతోందని తెలుస్తోంది.
అందుకే వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే కాదు.యావత్ రాష్ట్ర ప్రజలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారని సమాచారం.