Cricket umpire: క్రికెట్ అంపైర్ కావడం మీ ధ్యేయమా... అయితే ఈ రూల్స్ తెలుసుకోండి!

ప్రపంచంలో ఎన్ని ఆటలున్నా క్రికెట్ క్రీడకు వున్న క్రేజ్ వేరు.మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి విపరీతమైన ఫాలోయింగ్ వుంది.

 How To Become An Cricket Umpire Details, Cricketers, Cricket Empire, Technology-TeluguStop.com

ఒక సాధారణం వన్డే మ్యాచ్ వచ్చినప్పుడు కూడా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు.ఇక దీనిగురించి ప్రతిరోజూ యువకులు లక్షల్లో ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారని ఓ సర్వే.

క్రికెట్ గురించి, అందులోని విషయాల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ వుంటారు.అందుకే ఇప్పుడు అంపైర్ గురించి తెలుసుకుందాం.

క్రికెట్ లో అంపైర్ కు ఉండే ప్రాధాన్యాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

అంపైరింగ్ సరిగ్గా చేయక పోతే దాని ఫలితం ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఓడిపోవాల్సిన వారు గెలుస్తూ వుంటారు.గెలవాల్సిన వారు ఓడిపోతూ వుంటారు.

అందుకే క్రికెట్ ప్రపంచంలో అంత కీలకమైనది అంపైర్ పోస్ట్.అయితే అసలు అంపైర్ అవ్వాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? వారికి వేతనాలు ఎలా ఉంటాయి? అనే విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.అంపైర్ అవ్వడానికి క్రికెట్ నేపథ్యం కలిగి ఉండాల్సిన అవసరం లేనేలేదు.అయితే క్రికెట్ ఆడి ఉన్నవారికైతే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.ముందుగా మీరు స్థానిక మ్యాచులలో అంపైర్ గా చేసి ఉండాలి.తర్వాత మీ పేరును రాష్ట్ర సంఘంలో నమోదు చేసుకోవాలి.

అంతేకాకుండా రాష్ట్ర స్థాయి మ్యాచుల్లో అంపైర్ గా పని చేయాలి.

Telugu Bcci, Cricket Umpire, Cricket Empire, Cricketumpire, Cricketers-Latest Ne

మీ ప్రతిభ, అనుభవం ఆధారంగా రాష్ట్ర సంఘం మీ పేరును BCCI నిర్వహించే పరీక్షకు పంపుతుంది.ఇది లెవల్ 1 పరీక్ష.ప్రతి ఏటా BCCI ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

రాష్ట్ర సంఘాలు పంపిన అంపైర్లకు ముందుగా 3 రోజుల పటు శిక్షణ ఉంటుంది.నాలుగోరోజు రాత పరీక్ష, తర్వాత ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలు ఉంటాయి.

అందులో ఉత్తీర్ణత సాధించిన వారు లెవల్ 2 కి అర్హత సాధిస్తారు.ఆ తరువాత లెవల్ 3 వైద్య పరీక్ష ఉంటుంది.

అందులో కూడా ఉత్తీర్ణుత సాధించిన తరువాత BCCI అంపైర్లుగా ఎంపిక చేస్తుంది.ఇక వీరి జీతాల విషయానికొస్తే, A గ్రూప్ అంపైర్‌కు రోజుకు దాదాపు 40 వేల రూపాయలు, గ్రేడ్ B అంపైర్లకు రూ.30,000 లు ఇస్తారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube