Baladitya Remuneration : బిగ్ బాస్ కోసం బాలాదిత్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం 21 మంది కంటెస్టెంట్లతో ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఇలా ఈ కార్యక్రమం ఇప్పటికే 10 వారాలు పూర్తిచేసుకుని హౌస్ నుంచి 11 మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.

 Do You Know The Remuneration Taken By Baladitya For Bigg Boss , Bigg Boss6,bigg-TeluguStop.com

పదవ వారం ఊహించిన విధంగా డబుల్ ఎలిమినేషన్ కావడంతో ఇద్దరు కంటెస్టెంట్ లో హౌస్ నుంచి బయటకు వెళ్లారు.శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ కాగా ఆదివారం వాసంతి బిగ్ బాస్ హౌస్ వీడారు.

ఇకపోతే బాలాదిత్య బాలనటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా హీరోగా కూడా నటించి సందడి చేశారు.అలాగే పలు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించారు.

ఎంతో పాజిటివ్ మైండ్ సెట్ కలిగినటువంటి బాలాదిత్య టాప్ 5 కంటెస్టెంట్ గా ఉంటారని అందరూ భావించినప్పటికీ ఈయన మాత్రం ఊహించని విధంగా పదవ వారం ఎలిమినేట్ కావడం అభిమానులను కాస్త షాక్ కి గురి చేసింది.ఇకపోతే ఈయన ఎలిమినేట్ కావడంతో ఏ విధమైనటువంటి ఎమోషన్స్ బయట పెట్టకుండా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

Telugu Baladitya, Bigg Boss, Double-Movie

ఇక 10 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన బాలాదిత్య ఎలిమినేట్ కావడంతో ఈయన బిగ్ బాస్ ద్వారా ఎంత మొత్తంలో సంపాదించారు… ఈయనకు బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బాలాదిత్య బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు ఈయన సుమారు 6.5లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.అయితే బాలాదిత్యకు ఒక విధంగా బిగ్ బాస్ చెల్లించిన ఈ రెమ్యూనరేషన్ మంచి ఆదాయమేనని చెప్పాలి.

మొత్తానికి టాప్ 5 కంటెస్టెంట్ గా ఉంటారనుకున్న బాలాదిత్య పదవ వారం ఎలిమినేట్ కావడంతో అభిమానులకు కాస్త నిరుత్సాహం ఎదురైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube