సమంత నుంచి సాయి పల్లవి వరకు గర్భవతులుగా నటించిన హీరోయిన్స్ వీళ్ళే !

సాధారణంగా హీరోయిన్స్ అన్న తర్వాత ఎప్పుడు డిఫరెంట్ పాత్రలు చేస్తూనే ఉంటారు.ఇటీవలికాలంలో అయితే ఎంతో మంది హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 Heroines Who Acted As Mothers In Movies Samantha Saipallavi Anushka Details, Tol-TeluguStop.com

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు గర్భవతిగా ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌందర్య :

తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన సినిమాలో మొదటిసారి తొమ్మిది నెలల గర్భవతి పాత్రలో నటించింది సౌందర్య.తర్వాత పలు సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలే చేసింది.

సమంత :

సమంత తన కెరీర్ లో మొదటి సారి గర్భవతి పాత్ర లో యశోద అనే తెలుగు సినిమాలో కనిపించబోతుంది అనేది తెలుస్తుంది.అయితే అంతకుముందు తమిళ సినిమా పోలీసోడు లో కూడా గర్భవతిగా కనిపించింది.

అనుష్క :

అనుష్క తన కెరీర్లో మొట్టమొదటిసారి ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి సినిమాలో ఓ అతిధి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

Telugu Anushka Shetty, Kriti Sanon, Nithya Menon, Sai Pallavi, Samantha, Soundar

కీర్తి సురేష్ :

లేడి ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెంగ్విన్ సినిమాలో గర్భవతిగా నటించింది.కీర్తి సురేష్ నితిన్ హీరోగా వచ్చిన రంగ్ దే సినిమాలో కూడా గర్భవతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి.

సాయి పల్లవి :

పావై కాదాగల్ అనే సినిమాలో మొదటిసారి గర్భవతి పాత్రలో నటించింది సాయిపల్లవి.అయితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.కానీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

నిత్యా మీనన్ :

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన అదిరింది సినిమాలో విజయ్ భార్యగా నటించిన నిత్యా మీనన్ గర్భవతి పాత్రలో నటించింది.ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచింది.

Telugu Anushka Shetty, Kriti Sanon, Nithya Menon, Sai Pallavi, Samantha, Soundar

విద్యాబాలన్ :

ఎప్పుడూ హాట్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మైమరిపించే విద్యాబాలన్ కహాని అనే సినిమాలో నిండు గర్భిణీ గా నటించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

కృతి సనన్ :

మిమి అనే సినిమాలో ఈ అమ్మడు గర్భవతి గా నటించి సరొగేట్ మదర్ గా నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

ఇక కరీనా కపూర్ కియారా అద్వానీ ఇద్దరు కలిసి గుడ్ న్యూస్ అనే సినిమాలో గర్భవతి పాత్రలో నటించారు.

మరోవైపు ప్రియాంక చోప్రా కూడా బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్ లో గర్భవతి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube