టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న త్రిష( Trisha ) ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాస్పద విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.త్రిష తన రెమ్యునరేషన్ ను( Trisha Remuneration ) అమాంతం పెంచేశారని ఆమె పారితోషికం ఏకంగా 6 కోట్ల రూపాయలు అని కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.
ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.
అయితే ఆ రెమ్యునరేషన్ ను త్రిష అక్రమంగా విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారంటూ కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు.
త్రిష పరువు పోవాలనే ఆలోచనతో కొంతమంది ఆమెను కావాలని టార్గెట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.త్రిషను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
![Telugu Trisha, Kollywood, Trishacareer, Trisha Suit, Trisha Offers-Movie Telugu Trisha, Kollywood, Trishacareer, Trisha Suit, Trisha Offers-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/heroine-trisha-new-controversy-detailsa.jpg)
త్రిష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.త్రిష పరువు నష్టం దావా( Defamation Case ) చేయడం వల్లే ఆమెను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.త్రిష తన గురించి తప్పుగా ప్రచారం అవుతున్న వార్తలపై వెంటనే స్పందించి ఆ వార్తలపై చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.త్రిష తెలుగులో చిరంజీవి, వెంకటేశ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
![Telugu Trisha, Kollywood, Trishacareer, Trisha Suit, Trisha Offers-Movie Telugu Trisha, Kollywood, Trishacareer, Trisha Suit, Trisha Offers-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/heroine-trisha-new-controversy-detailss.jpg)
త్రిష తమిళం కంటే తెలుగు భాషకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.త్రిష 40 సంవత్సరాల వయస్సులో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.మరికొన్ని సంవత్సరాల పాటు త్రిష కెరీర్( Trisha Career ) పరంగా బిజీగా ఉండేలా కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.త్రిష తమిళంలో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.
త్రిష పాత హీరోలతో మళ్లీ జోడీ కడుతుండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.