అప్పట్లో అగ్రతారగా ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్నారు ఆమె.
ఇక ఇండస్ట్రీలో దాదాపు వందల సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే సిల్క్ స్మిత అందం ముందు ఎవరూ సాటి రారు అని ఒకప్పటి నటులు ఇప్పటికీ చెబుతుంటారు.
ఇక ఇప్పుడు అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మాలాశ్రీ సైతం సిల్క్ స్మిత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చింది మాలాశ్రీ.
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు విశేషాలను అభిమానులతో పంచుకుంది.కన్నడలో తాను మొదటి సినిమా చేసే సమయంలో నాకు కన్నడ రాదు.
దీంతో ఎలా డైలాగులు చెప్పాలో అర్థం కాలేదు.దీంతో ఇక నన్ను సినిమా నుంచి తీసేస్తారు అని రోజూ ఏడ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
కానీ ఆ తర్వాత కన్నడ నేర్చుకోవడం మొదలు పెట్టా అంటు తెలిపిందిm ఇక రాజ్కుమార్ తనను ఫ్యామిలీ మెంబర్ గా చూసేవారు అంటూ గుర్తు చేసుకుంది.ప్రేమఖైదీ సినిమా చేస్తున్న సమయంలో నిర్మాత రామానాయుడు ఈ సినిమా హిట్ అయితే కారు గిఫ్టుగా ఇస్తాను అంటూ మాట ఇచ్చారు.
సినిమా సూపర్హిట్ అయ్యింది.వెంటనే ఆయన ఇంటికి కార్ బహుమతిగా పంపించారు అంటూ మాలాశ్రీ చెప్పుకొచ్చింది.

ఇక బావ బావమరిది సినిమా చేస్తున్న సమయంలో నేను ఆశ్చర్యంలో మునిగిపోయా.ఎందుకంటే ఆ సినిమాలో అందరూ స్టార్లే.ఒకవైపు కృష్ణంరాజు మరోవైపు జయసుధ ఇంకోవైపు సుమన్, సిల్క్ స్మిత కూడా ఉన్నారు.వారందరితో కలిసి నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఇక ఎప్పుడూ ఇలా స్టార్స్ అందరితో కూడా లొకేషన్ కళకళలాడుతూ ఉండేది.సిల్క్ స్మిత ని ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండేదాన్ని.
ఆమె వాకింగ్ ఆమె స్టైల్ ఎంతో అద్భుతంగా ఉండేది.ఇక ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి అంటూ మాలాశ్రీ ఇటీవలే చెప్పుకొచ్చింది.
మంచి పాత్రలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది అప్పటి హీరోయిన్ మాలాశ్రీ.