త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో మహేశ్ బాబు(Mahesh Babu) , శ్రీ లీల ( Sreeleela ) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం( Gunturu Kaaram ) ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరై సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో మహేష్ బాబు శ్రీ లీల క్యూట్ గా కనిపించిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా శ్రీ లీల ( Sreeleela నెట్ చీరలో కనిపించి సందడి చేశారు.ఈమె బాటిల్ గ్రీన్ నెట్టెడ్ శారీ కట్టుకొని ఈ వేడుకలో కనిపించారు.
చూడటానికి ఈమె చీర చాలా డిఫరెంట్ గా అనిపించడంతో అందరి దృష్టి ఈమె చీర పైన పడింది.దీంతో ఈమె కట్టుకున్నటువంటి చీర ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
అయితే ఈమె కట్టుకున్న చీర ఖరీదు తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ లీలా కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు అక్షరాల 1.59 లక్షల రూపాయలు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కేవలం ఒక గంట కార్యక్రమం కోసం ఈమె ఈ స్థాయిలో ఖర్చు చేసింది అంటే ఈమె రేంజ్ ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీలతో పాటు మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నారు.
త్రివిక్రమ్ డైరెక్షన్లో మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి మహేష్ బాబు ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.