శివకార్తికేయన్, అనుదీప్ KV #SK20 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

బహుముఖ నటుడు శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్విభాషా చిత్రం (తెలుగు తమిళం).

 శివకార్తికేయన్, అనుదీప్ Kv #sk20 ర�-TeluguStop.com

ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తన దర్శకత్వం వహించిన `జాతి రత్నాలు` బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారిన అనుదీప్, తెలుగులో తన చివరి చిత్రం వరుణ్ డాక్టర్ విజయంతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కోసం అద్శుత‌మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.

శివకార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం, SK20 గా ఈరోజు (గురువారం నాడు) లాంఛనంగా ప్రారంభమైంది.ఈరోజు నుండి సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలియజేసారు.

సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో చిత్రీకరించబ‌డుతోంది.ఈ షూటింగ్ లో నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నారు.

SK20 లో విభిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది.ఈ చిత్ర కథ భారతదేశంలోని పాండిచ్చేరి, UKలోని లండన్ నేపథ్యంలో ఉంటుంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మాతలు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించారు.ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించ‌నున్నారు.

తారాగణం:

శివకార్తికేయన్, సత్యరాజ్.

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: అనుదీప్ కె.వి,

సంగీత దర్శకుడు: ఎస్ థమన్,

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు సురేష్ బాబు,

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్,

సహ నిర్మాత: అరుణ్ విశ్వ,

PRO: వంశీ-శేఖర్.

Hero Shiva Karthikeyan Anudeep Kv Movie Shooting Begins Details, Hero Shiva Karthikeyan, Director Anudeep Kv, Shivakarthikeyan Movie ,shooting Begins, #sk20, Satya Raj, , Tollywood - Telugu Anudeep Kv, Satya Raj, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube