ట్రైన్‌ ఎన్ని కూతలు వేస్తే ప్రమాదమో తెలుసా?

సాధారణంగా రైళు కూత వేస్తే అందరి గుండెల్లో దడ పుడుతుంది.దాని విజిల్‌ వినగానే అందరూ అలర్ట్‌ అయిపోతారు.

 Here Is The Meaning For Train Different Horn Sound, Loco Pilot , Moving Train,-TeluguStop.com

ట్రైన్‌ను లెక్క చేయకుండా ఇష్లానుసారంగా క్రాస్‌ చేసే వారి కోసం ఈ విజిల్‌ను ఏర్పాటు చేశారు.అయితే, ఈ కూతలకు కూడా ఓ అర్థం ఉంటుందట.

అంటే ఒక్కో విజిల్‌కు ఒక్కో అర్థం ఉంటుంది.సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు ఎక్కడపడితే అక్కడ ఆగదు.

ఎందుకంటే దానికి వెనకే వస్తున్న ఇతర ట్రైన్‌ల సిగ్నలింగ్‌కు ఆటంకం ఏర్పడుతుంది.పైగా రైలును ఆపితే దాని వెనుకున్న ఇతర ట్రైన్లను ఆపాల్సి ఉంటుంది.

మొత్తంగా అది కోట్లలో ఖర్చు అవుతుందట.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆపరు.

రైలు సాధారణ కూత కూస్తే అంటే ఓసారి కూస్తే ట్రైయిన్‌ను క్లీన్‌ చేయడానికి తీసుకెళ్లున్నారని అర్థం.ఒకవేళ ట్రైన్‌ రెండు కూతలు కూసిందంటేసిగ్నల్‌ కోసం గార్డును అడుతున్నట్లు లెక్క.

రైలు చిన్నగా మూడు కూతలు కూస్తే ఇంజిన్‌ కంట్రోల్‌ తప్పిందని అర్థం.సాధారణంగా అత్యవసరమయితే తప్ప దీన్ని వాడరు.

దీంతో వెంటనే వాక్యూమ్‌ బ్రేక్‌ చేస్తారు.నాలుగు చిన్న కూతలు కూస్తే సాంకేతిక సమస్య ఏర్పడినట్లు.

ఒకవేళ ఓ పెద్దకూత, మరోచిన్న కూత వేస్తే రైల్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ చేసే ముందు బ్రేక్‌ పైప్‌లైన్‌ సిస్టం సిద్ధమైందని గార్డుకు తెలియజేసేందుకు ఈ హార్న్‌ కొడతారు.రెండు పెద్ద కూతలు, రెండు చిన్న కూతలు ఇంజిన్‌ను కంట్రోల్‌ తీసుకోవాలని గార్డును అలర్ట్‌ చేసేందుకు వేస్తారు.

కంటిన్యూగా ఆగకుండా కూత వేస్తే ట్రైన్‌ ఆ స్టేషన్‌లో ఆపడం లేదని అర్థం.ఒకవేళ రైలు రెండు మార్లు ఆపి ఆపి కూస్తే రైల్వే క్రాసింగ్‌ మీదుగా వెళ్లేటప్పుడు ఇలా కూత వేస్తారు.

Telugu Horn Sound, Loco Pilot, Train, Signals, Sound, Gaurd-Latest News - Telugu

ట్రైన్‌ రెండు చిన్న కూతలు, ఒక పెద్ద కూత వేస్తే ప్రయాణికుడు చైన్‌ లాగితే వేస్తారు.లేదా గార్డు వాక్యూమ్‌ బ్రేక్‌ వేసినప్పుడు ఇలా రెండు చిన్న ఒక పెద్ద కూతలు వేస్తుంది.రైలు ఆరుమార్లు చిన్న హర్న్‌ వేస్తే ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లోనే ఇలా కూత వేస్తుంది.ఈ విధంగా రైలు కూతలకు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుందట.

ఈ కూతలు ప్రయాణికులకు పెద్దగా తెలీదు.కానీ, లోకోపైలట్‌ నుంచి గార్డు వరకు అందరికీ ఈ హారన్‌ తెలిసి ఉంటుంది.

ఈ కూతల ద్వారానే రైలు సిబ్బంది ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube