ఈరోజు ఇంటికి సంబంధించిన వాస్తు నియమాలు తెలుసుకుందాం.సాధారణంగా మనం నివసించే ఇళ్లు వాస్తు ప్రకారం నిర్మిస్తే అందరూ సుఖసంతోషాలతో ఉంటారు.
వాస్తు శాస్త్రం ముఖ్యంగా దిక్కులను సూచిస్తుంది.అందుకే మన పెద్దలు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం చూడాలని చెప్పారు.
ఇంటి లోపలి భాగంలో కూడా పూజగది, కిచెన్, హాల్, మాస్టర్ బెడ్ రూం ఎటువైపు నిర్మించాలో కూడా సూచించారు వాస్తుశాస్త్ర నిపుణులు.అందరూ ప్రతిదానికి ఎవరినో అడిగి తెలుసుకోవడం కంటే … కనీస అవగాహన కలిగి ఉండాలి.
బేసిక్ విషయాలను తెలిసి తెలియని వారిని అడిగి డబ్బులు వృథా చేసుకోవద్దు.ఆ వివరాలు తెలుసుకుందాం.

లేకపోతే పడమర వైపు ఉండాలి.అందుటో వంటగది ఆగ్నేయం దిశ, పూజగది ఈశాన్యంలో ఉండాలి అంటారు.
ఎందుకంటే ఆ దిశలో తూర్పు గోడకు లేదా ఉత్తరం గోడకు దేవుడి పటాలను పెట్టుకుంటాం.అందుకే ఈ దిశను సూచిస్తారు.
అప్పడు కచ్చితంగా తూర్పు లేదా పడమర వైపు తిరిగి పూజ చేస్తాం.అదేవిధంగా వంటగదిలో కూడా తూర్పు దిశకు తిరిగి వంట చేస్తాం.
అందుకే ఇలా సూచించారు.ఇంటిలోని బావి లేదా బోర్‌ను కూడా ఈశాన్యంలో నిర్మించాలి అని సూచించారు.
ఎందుకంటే పూర్వకాలంలో బావులు ఎక్కువగా ఉండే.అప్పట్లో స్నానం చేసినా.
గిన్నెలు తోమినా ఉత్తరం లేదా తూర్పుకు తిరిగి చేసుకునేవారు.ఎందుకంటే ఈశాన్యం మూల అంటే ఆ రెండు దిక్కుల్లో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
నైరుతి మూలలో కూడా బరువు పెట్టాలని మనం బిరువాలు ఇతర బరువు వస్తువులను పెడతాం.అదేవిధంగా తూర్పు గోడల కంటే పడమర గోడలు.
ఉత్తరం గోడల కంటే దక్షిణం గోడల ఎత్తు ఎక్కువగా ఉండాలంటారు.ఎందుకంటే ఆ గోడలు ఎత్తుగా ఉంటే మిగిలిన దిశలైన తూర్పు లేదా ఉత్తరం దిశకే మనం ఎక్కువగా చూస్తామని ఈ విధంగా సూచించారు.
అలాగే తూర్పున ఎక్కువ ఖాళీ స్థాలం, దక్షిణం కంటే పడమర దిక్కున ఖాళీ ప్రదేశాన్ని పెట్టుకోమంటారు.మాస్టర్ బెడ్ రూం కూడా నైరుతి దిశలోనే నిర్మిస్తారు.
బెడ్ కూడా నైరుతి మూలలోనే పెట్టాలని అంటారు.ఎందుకంటే అప్పుడే తూర్పు లేదా ఉత్తరం వైపునకు కూర్చునే అవకాశం ఉంటుంది.
పడుకున్నా.పడమర దిశలో లేదా దక్షిణం దిశగా తల పెట్టి పడుకుంటారు.
అంటే మొత్తం వాస్తు తూర్పు లేదా ఉత్తరం దిశను ఆధారం చేసుకుని సూచించింది.