చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..

ప్రపంచంలో చాలా చోట్ల అప్పుడప్పుడు అనుకోని పరిస్థితుల్లో కొన్ని వింత విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి.మనం చాలాసార్లు ఆకాశం నుండి వర్షంతో పాటు అప్పుడప్పుడు చేపలు( Fishes ) పడడం లాంటి విషయాలను మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే ఉంటాం.

 Have You Ever Seen Rain Of Fish Video Viral Details, Social Media, Viral Video,-TeluguStop.com

అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.తాజాగా మరోసారి వర్షం పడిన సమయంలో చేపలు కూడా పడడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇరాన్( Iran ) దేశంలోని ఓ ప్రాంతంలో తాజాగా ఈ అనుభవం కళ్ళ ముందు ప్రజలకు జరిగింది.ప్రస్తుతం ఇరాన్ దేశంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాసుజ్ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు చేపల వాన( Fish Rain ) కూడా కురిసింది.

ఈ దృశ్యం చూసిన ప్రజలు షాక్ అయ్యారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.కొన్ని లక్షల మంది ఈ వీడియోని చూడగా.వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.అయితే ఇలా చేపల వర్షం కురవడం వెనక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంటుంది.నిజానికి ఆకాశం నుంచి ఇలా చేపలు పడడానికి గల కారణం.

భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బరమైన ఈదురు గాలులు వస్తాయి.దాంతో సముద్ర, నది, సరస్సుల జలాలలో వాటిలో నివసించే చేపలన్ని గిరగిరా తిరుగుతూ పైకి వెళ్తాయి.

అలా ఆ గాలులు మేఘాలతో( Clouds ) పాటు చేపలు కూడా ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్లి ఆ తర్వాత సుడిగాలి భూమి పైకి వర్షం కురిసిన సమయంలో చేపలన్ని భూమిపై పడతాయి.ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భారీ తీర ప్రాంతం నుండి సుడిగాలులు, టోర్నడోలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.మన భారతదేశంలో కూడా ఇలాంటి అరుదైన సన్నివేశాలు ఇదివరకు కొన్నిసార్లు జరిగాయి.హోండరుస్ దేశంలో ఈ చేపల వర్షం అతి సర్వసాధారణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube