Mudragada Padmanabham : ‘ముద్రగడ ‘ కు లైన్ క్లియర్ అయ్యిందా ? వారి నుంచి అభ్యంతరాలు లేనట్టేనా ? 

కాపు ఉద్యమ నేత,  మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది.ముద్రగడ ఎప్పటి నుంచో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతూనే వస్తోంది.

 Has The Line To Mudragada Cleared Are There No Objections From Them-TeluguStop.com

అయితే కొన్ని కొన్ని కారణాలవల్ల ఆ చేరికకు బ్రేకులు పడుతూ వస్తున్నాయి.ఇక ఈ మధ్యనే ఆయన జనసేనలో చేరబోతున్నట్లుగా హడావుడి జరిగింది.

ఈ విషయంలో ముద్రగడ కూడా జనసేనలో చేరబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.స్వయంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది.

కానీ తూర్పుగోదావరి జిల్లా పర్యటన కు వెళ్లిన పవన్( Pawan ) ముద్రగడ నివాసానికి వెళ్లలేదు.ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించలేదు .దీంతో తాను జనసేనలో చేరకుండా టిడిపినే అడ్డుకుంటుందని ముద్రగడ భావించారు.

Telugu Chandrababu, Linemudragada, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan-Poli

ఇదే విషయంలో కాపు సామాజిక వర్గం నేతలకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని ముద్రగడ భావిస్తున్నారు .ఎప్పటి నుంచో తనను జనసేనలో( Janasena ) చేరాల్సిందిగా కాపు సామాజిక వర్గం కు చెందిన వారంతా ఒత్తిడి చేస్తున్నారు.కాపులకు రాజ్యాధికారం దక్కే సమయంలో ఇతర పార్టీలలో చేరే కంటే జనసేన వైపు వెళ్లాలని చాలామంది సూచించారు.

దీంతో ముద్రగడ కూడా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.కాకపోతే జనసేన వైపు నుంచి ముద్రగడకు సరైన ఆహ్వానం రాకపోవడం,  పవన్ కూడా పట్టించుకోనట్టుగా వ్యవహరించడంతో టీడీపీ( TDP ) అధినేత చంద్రబాబే పవన్ ను ఈ విషయంలో అడ్డుకుంతున్నారని ముద్రగడతో పాటు,  ఆ సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారు.

Telugu Chandrababu, Linemudragada, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan-Poli

దీంతో ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.ఈ విషయంలో కాపు సామాజిక వర్గం కూడా వైసీపీలో ముద్రగడ చేరేందుకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు .తాను జనసేనలో చేరాలనుకున్నా.అటువైపు నుంచి స్పందన లేకపోవడంతోనే తప్పని సరి పరిస్థితుల్లో వైసీపీలో చేరాల్సి వచ్చిందని చెప్పుకునే ఛాన్స్ ముద్రగడకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube