పవన్ బర్త్‌డేకు గిఫ్టు రెడీ చేస్తోన్న హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Harish Shankar Treat For Pawan Kalyan Birthday, Harish Shankar, Pawan Kalyan, Va-TeluguStop.com

కాగా ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసిన పవన్, మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.గతంలో గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన గిఫ్టును చిత్ర యూనిట్ పవన్ పుట్టినరోజు సందర్భంగా అందించనుంది.సెప్టెంబర్ 2న సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

దీంతో పవన్ బర్త్‌డే ట్రీట్‌ను ఎంజాయ్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.అయితే దర్శకుడు క్రిష్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఆశించగా, వారికి షాకిస్తూ హరీష్ శంకర్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

ఏదైతేనేమి తమ అభిమాన హీరో పుట్టినరోజున ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన ట్రీట్ రానుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube