అసలే హెచ్-1బీ వీసా జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం పెట్టిన ఆంక్షలకి ఎన్నారై లు సతమతమవుతుంటే.ఇప్పుడు హెచ్-1బీ జారీలో జరుగుతున్న మోసాలు అక్రమాలు ఎన్నారైలకి పెద్ద చిక్కుని తెచ్చి పెడుతున్నాయి హెచ్-1బీ వీసాలలో భారీగా మోసాలు, దుర్వినియోగం జరిగనట్టు ఫిర్యాదులు వచ్చాయని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.హెచ్-1బీ, హెచ్-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన తమ ప్రత్యేక ఈ మెయిల్, హెల్స్లైన్కు 5వేలకు పైగా ఫిర్యాదులు అందాయని ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు.
క్రిందటి ఏడాది కి సంభందించిన అక్రమాలు ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు అయితే ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు.అంతేకాదు ఫిర్యాదులు ఏ ఏ దేశాల నుంచీ వచ్చాయి అనే విషయాన్ని కూడా అధికార్లు ప్రకటించలేదు.ఇదిలాఉంటే వీసాల జారీ విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కటినమైన నిర్ణయం నిభందనలు మనకి తెలిసినవే.
అమెరికాలో ఉన్న తమ పౌరులకి ఉద్యోగాలు అందాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చినా ట్రంప్ వెనకడుగు వేయలేదు.
అయితే ఇలాంటి నేపధ్యంలో వీసా జారీ ప్రక్రియలో అక్రమాలు, మోసాలను జరగడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉలిక్కిపడ్డారు వెంటనే చర్యలు చేపట్టారు…ముఖ్యంగా హెచ్-1బీ, హెచ్-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఈ మెయిల్ హెల్ప్ లైన్ ఏర్పారు చేశారు ([email protected]/[email protected])
.