చిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయిన మారుతి మెల్ల మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ చిత్రాలతో దర్శకుడిగా వరుస విజయాలను దక్కించుకున్న మారుతి ప్రస్తుతం నాగచైతన్యతో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఆ కారణంగానే దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తన మార్క్‌ను దాటి మరో అడుగు ముందుకు వేసి సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఇప్పటి వరకు మారుతి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా 15 కోట్ల లోపు బడ్జెట్‌తోనే రూపొందాయి.కాని మొదటి సారి నాగచైతన్య సినిమా కోసం 20 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.నాగచైతన్య కెరీర్‌లో కూడా ఇది ఎక్కువ బడ్జెట్ చిత్రంగా నిలువబోతుందని ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు.ఈ పాటను ఏకంగా 1.2 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాలో ఒక సంగీత్ పాట ఉంటుంది.ఆ పాటకు దర్శకుడు మారుతి ఇంత ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.భారీ ఎత్తున ఖర్చు చేస్తున్న మారుతి సునాయాసంగా తాను ఖర్చు చేసిన బడ్జెట్‌ను రికవరీ చేయగలను అనే నమ్మకంతో ఉన్నాడు.భలే భలే మగాడివోయ్ మరియు మహానుభావుడు చిత్రాలు పాతిక కోట్లకు పైగా వసూళ్లు చేశాయి.
అందుకే మారుతి ఈసారి తన మార్క్‌ను క్రాస్ చేసి కాస్త ఎక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మారుతి మొదటి సినిమా ‘ఈరోజుల్లో’ కోటి లోపు బడ్జెట్‌తో రూపొందించిన మారుతి తన బ్రాండ్ వ్య్యాూ పెరుగుతున్న కొద్ది సినిమా బడ్జెట్‌ను పెంచుతూ పోతున్నాడు.
ఒక వేళ శైలజ రెడ్డి అల్లుడు సినిమా సక్సెస్ అయితే తన తదుపరి సినిమా బడ్జెట్ పాతిక కోట్లకు పెంచుతాడేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో నాగచైతన్య మంచి పాత్రలో కనిపించబోతున్నట్లుగా మారుతి చెబుతున్నాడు.
ఇప్పటి వరకు చైతూను ఎవరు చూపించని కొత్త యాంగిల్‌లో మారుతి చూపించబోతున్నాడట.త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు.
ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.