వాహనదారులకు అలర్ట్‌..ఇక హెల్మెట్‌ పై ఈ గుర్తు తప్పనిసరి!

ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన ఉంది.అయితే కొంతమంది నాణ్యత లేని హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పడు ప్రాణాలు విడుస్తున్నారని పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలిపారు.

 Government Ordered To Wear Only Bis Mark Helmets. Accidents, Police, Helmets.l-TeluguStop.com

అయితే, ఈ హెల్మెట్‌ క్వాలిటీపై రవాణా శాఖ అధికారులు ఓ నిబంధన విధించారు.ప్రతి సంవత్సరం వేలమంది రోడ్డు యాక్సిడెంట్లతో మృత్యువాత పడుతున్నారు.

మరికొంత మంది క్షతగాత్రులగా మిగులుతున్నారు.ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ శాతం టూవీలర్‌ నడిపేవారు అని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.

Telugu Bis, Road-Latest News - Telugu

అందులో 85 శాతం మంది తలకు బలమైన గాయం కారణంగానే చనిపోతున్నారని తేలింది.దీంతో కేంద్ర ప్రభుత్వం హెల్మెట్‌ తప్పనిసరి చేసింది.దీంతో హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు.ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తున్నారు.

అయితే చాలా మంది చలానాలను తప్పించుకోవడానికే హెల్మెట్‌ను ధరిస్తున్నారు కానీ, అవి నాణ్యమైనవి కావు.తక్కువ ధరకు వస్తుండటంతో ఈ హెల్మెట్‌లను కొంటున్నారు.

దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న పిలియన్‌ రైడర్లు సైతం దుర్మరణం చెం దుతున్నట్లు గుర్తించిన పోలీసులు పిలియన్‌ రైడర్‌కు కూడా హెల్మెట్‌ వాడటం తప్పనిసరి చేశారు.దీంతో వ్యాపారులకు విపరీతమైన గిరాకీ పెరిగింది.

Telugu Bis, Road-Latest News - Telugu

జాతీయ రహదారుల వెంట, నకిలీ హెల్మెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.ప్రజల్లో హెల్మెట్‌ వినియోగంపై అవగాహన తేవాలనుకున్న పోలీసులూ వాటి నాణ్యతపై పెద్దగా దృష్టి సారించలేదు.దీనివల్ల ఒకవేళ ప్రమాదాలు జరిగినపుడు హెల్మెట్‌ పెట్టుకున్నా మృత్యువాత పడుతున్నారు.

దాన్ని గుర్తించిన పోలీసులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు.నకిలీ హెల్మెట్ల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.

ఈ మేరకు నోటీసును కూడా జారీ చేసింది.ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచే వాహనదారులు నాణ్యమైన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) గుర్తింపు ఉన్న హెల్మెట్లను మాత్రమే వాడాలి.

బీఐఎస్‌ లేని, నకిలీ హెల్మెట్‌ వాడితే జరిమానాలు విధించాలని సూచించింది.నకిలీ హెల్మెట్లను అంటగట్టే వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఇప్పటికే పలువురు నకిలీ హెల్మెట్‌ విక్రేతలపై గుర్తించి కేసు నమదు చేశామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube