చర్మ ఛాయ పెరిగితే బాగుంటుంది అని అనుకోని వారు ఉంటారా అంటే ఉండనే ఉండరని చెప్పాలి.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరూ చర్మ ఛాయ పెంచుకోవాలని చూస్తుంటారు.
అందు కోసం ఏవేవో క్రీములు, మాయిశ్చరైజర్లు, లోషన్లు వాడుతుంటారు.బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ.
ఎంతో డబ్బు కూడా ఖర్చు చేస్తుంటారు.కానీ, న్యాచురల్‌గా కూడా చర్మ ఛాయను పెంచుకోవచ్చు.
ముఖ్యంగా ఉసిరి చర్మ ఛాయను పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.మరి ఉసిరిని చర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పచ్చి ఉసిరి కాయలను ముక్కలుగా చేసి మిక్సర్లో వేసి రసం తీసుకోవాలి.ఆ రసంలో నిమ్మ రసం మరియు చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే చర్మ ఛాయ పెరగడంతో పాటు కాంతివంతంగా కూడా మెరుస్తుంది.
అలాగే ఉసిరి కాయ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి.
అందులో బాగా పండిన బొప్పాయి పేస్ట్ మరియు తేనె వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.
బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా చర్మ ఛాయ పెరుగుతుంది మరియు మొటిమలు, మచ్చలు కూడా తగ్గు ముఖం పడతాయి.
ఉసిరి కాయలను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఆ పొడిలో మెంతి పిండి, పెరుగు మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా చర్మ ఛాయ పెరుగుతుంది.అదే సమయంలో మృదువుగా కూడా మారుతుంది.