బ్రేకింగ్‌ న్యూస్‌ : ఆర్టీసీ కార్మికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నెలన్నర రోజులు చేసిన సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్దం అవ్వగా ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నో చెప్పింది.దాంతో గత రెండు మూడు రోజులుగా వారు బస్సు డిపోల వద్ద ఆందోళనలు చేస్తూ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.

 Good News For Rtc Employes-TeluguStop.com

అయినా కూడా ఆర్టీసీ అధికారులు వారిని విధుల్లోకి తీసుకోకుండా ప్రైవేట్‌ డ్రైవర్లు మరియు కండక్టర్లతోనే నడిపించారు.

నేడు మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ అందులో ఆర్టీసీ సమస్యపై చర్చించాడు.

ఈ సందర్బంగా పలు విషయాలను చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్‌ కేబినేట్‌ మీట్‌ తర్వాత చెప్పుకొచ్చాడు.గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా ఆర్టీసీ ఎంప్లాస్‌లో కోత లేకుండాఅందరికి అందరిని కూడా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు.

రేపటి నుండి కార్మికులు అంతా కూడా విధుల్లో హాజరు కావాలంటూ కేసీఆర్‌ సూచించాడు.గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు ఇక లేనట్లే అంటూ వార్తలు వస్తుండగా కేసీఆర్‌ ప్రకటనతో కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube